AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CTET Notification 2024: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 నోటిఫికేషన్.. 2 రోజుల్లో ముగుస్తోన్న గడువు

సీబీఎస్సీ బోర్డు ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదికి సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - జనవరి 2024 నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) విడుదల చేసింది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా విడుదలైన జనవరి-2024 సీటెట్​నోటిఫికేషన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ..

CTET Notification 2024: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 నోటిఫికేషన్.. 2 రోజుల్లో ముగుస్తోన్న గడువు
CTET January-2024
Srilakshmi C
|

Updated on: Nov 30, 2023 | 1:11 PM

Share

సీబీఎస్సీ బోర్డు ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదికి సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) – జనవరి 2024 నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) విడుదల చేసింది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా విడుదలైన జనవరి-2024 సీటెట్​నోటిఫికేషన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియ నుంది. రాత పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జనవరి-2024 దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పేపర్-1 కనీసం 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక పేపర్-2కు అయితే 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ)/ బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము కింద జనరల్/ ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు పేపర్ 1 లేదా 2కు రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు కలిపి రూ.1200 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు పేపర్ 1 లేదా 2 ఏదైనా ఒక పేపర్‌కు రూ.500 ఫీజు కింద చెల్లించాలి. రెండు పేపర్లకు కలిపి రూ.600 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే.. పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్‌లో ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తారు. రెండో పేపర్​ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారికి నిర్వహిస్తారు. సీటెట్​స్కోర్ లైఫ్​లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను ఆంగ్లం, హిందీతోపాటు 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తేదీ జనవరి 21, 2024 నిర్వహిస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..