JEE Advanced 2024 Deadline: మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్ గడువు ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు రాత్రి 11.30 గంటలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఫీజు చెల్లింపులు చేసుకోవాలి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) విద్యార్ధులకు..

JEE Advanced 2024 Deadline: మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు
JEE Advanced 2024 Deadline
Follow us

|

Updated on: May 07, 2024 | 2:56 PM

న్యూఢిల్లీ, మే 7: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్ గడువు ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు రాత్రి 11.30 గంటలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఫీజు చెల్లింపులు చేసుకోవాలి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) విద్యార్ధులకు సూచించింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఐఐటీ మద్రాస్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష టైం టేబుల్, సిలబస్‌లను ఇప్పటికే తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష మే 26వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాసేందుకు జేఈఈ మెయిన్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన తొలి 2.5 లక్షల మందికి మాత్రమే అర్హత ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1, 2లకు కలిపి మొత్తం 24 లక్షల మంది పోటీ పడిన సంగతి తెలిసిందే.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2024 అడ్మిట్‌కార్డుల మే 17 నుంచి 26 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మే 26వ తేదీన రెండు షిఫ్టులలో పరీక్ష జరుగుతుంది. మొదటి సెషన్‌లో పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్‌లో పేపర్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ జూన్ 02న వెల్లడిస్తారు. కీపై అభ్యంతరాల నమోదు జూన్ 02 నుంచి జూన్ 03 వరకు కొనసాగుతుంది. ఫైనల్ కీతోపాటు జేఈఈ ఆడ్వాన్స్‌ ఫలితాలను జూన్ 09వ తేదీన విడుదల చేస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణులైన వారు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జూన్‌ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఏఏటీ-2024 పరీక్ష జూన్‌ 12వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఐఐటీల్లోని బీఆర్క్‌ కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించవల్సి ఉంటుంది. ఏఏటీ ఫలితాలు జూన్‌ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తారు. జూన్‌ 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..