AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGUKT AP IIIT Admission 2024: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆర్‌జీయూ కేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు..

RGUKT AP IIIT Admission 2024: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు
RGUKT AP IIIT Admission 2024 Notification
Srilakshmi C
|

Updated on: May 07, 2024 | 2:30 PM

Share

అమరావతి, మే 7: ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆర్‌జీయూ కేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అమవుతుంది. జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3 ఫేజ్‌లలో కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు.

సీట్ల కేటాయింపు ఇలా..

మొత్తం నాలుగు క్యాంపస్‌లలో.. ఒక్కో క్యాంపస్‌కు వెయ్యి సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు 25 శాతం సూపర్‌ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ ప్రకారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా కేటగిరీ వైజ్‌ ప్రాధాన్యత క్రమంలో క్యాంపస్‌లను కేటాయించడం జరుగుతుంది. ఒకసారి క్యాంపస్‌ కేటాయించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో బదిలీకి అవకాశం ఉండదు.

ఫీజు వివరాలు..

పీయూసీ కోర్సుకి ట్యూషన్‌ ఫీజు కింద ఒక్కో ఏడాది రూ.45 వేలు చెల్లించవల్సి ఉంటుంది. బీటెక్‌ ప్రోగ్రాంకు ఏడాదికి రూ.50 వేల చొప్పున చెల్లించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ట్యూషన్‌ ఫీజు కింద ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మే 8, 2024. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు తుది గడువు: జూన్ 25, 2024. ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: జులై 1 నుంచి 5 వరకు ఫలితాల ప్రకటన తేదీ: జులై 11, 2024. ప్రవేశాల ప్రారంభ తేదీ: జులై మూడో వారం నుంచి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి