Inida Air Force Recruitment 2022: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (Inida Air Force).. గ్రూప్‌ 'సీ' సివిలియన్‌ పోస్టుల (Group 'C' Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Inida Air Force Recruitment 2022: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ 'సీ' సివిలియన్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Iaf
Follow us

|

Updated on: Jun 30, 2022 | 6:29 PM

Inida Air Force Group C Recruitment 2022: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (Inida Air Force).. గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ పోస్టుల (Group ‘C’ Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 21

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

పోస్టుల వివరాలు:

  • మెయింటెనెన్స్‌ కమాండ్‌ పోస్టులు: 13
  • వెస్టర్న్‌ ఎయిర్‌ కమాండ్‌ పోస్టులు: 8

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌లకు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ వెలువడింనప్పటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (ఆగస్టు 2, 2022).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.