Punjab: అగ్నిపథ్ వ్యతిరేక తీర్మాణానికి పంజాబ్ అసెంబ్లీ ఆమోదం
అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవేశ పెట్టిన తీర్మాణాన్ని పంజాబ్ అసెంబ్లీ గురువారం (జూన్ 30) ఆమోదించింది..
Punjab assembly passes resolution against Agnipath: అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవేశ పెట్టిన తీర్మాణాన్ని పంజాబ్ అసెంబ్లీ గురువారం (జూన్ 30) ఆమోదించింది. తీర్మానంపై కొనసాగిన చర్చలో ముఖ్యమంత్రి భగవంత్ మాట్లాడుతూ.. త్వరలో అగ్నిపథ్ పథకంపై ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రితో చర్చిస్తాం. ఈ పథకం దేశ యువతకు మేలు చేయదు. అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ శాసనసభ్యుడు పర్తాప్ సింగ్ బజ్వా డిమాండ్ చేశారు. అకాలీ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్ అయాలీ కూడా తీర్మానానికి మద్దతు ఇస్తూ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నాయకులైన అశ్వినీ శర్మ, జంగీలాల్ మహాజన్ ఈ తీర్మాణానికి వ్యతికేకంగా నినాదాలు చేశారు.
Punjab assembly passes resolution against Agnipath recruitment scheme
ఆర్మీ, నేవీ, ఎయర్ ఫోర్స్.. త్రివిద దళాల్లో 17 నుంచి 21 ఏళ్ల వయస్సు ఉన్న యువతను నాలుగేళ్ల ప్రాతిపదికన రిక్రూట్ చేయడానికి కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆవిష్కరించిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. తాజాగా ఈ ఏడాది చేపట్టబోయే నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 23కి సడలింపునిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.