Infosys Narayana Murthy: వర్క్ ఫ్రమ్ హోం విధానంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆసక్తికర కామెంట్స్

కరోనా విజృంభణ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (work-from-home) కు పలు సంస్థలు మొగ్గు చూపాయి. తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. అయితే కరోనా వ్యాప్తి తగ్గడం, టీకాలు వేయించుకోవడం...

Infosys Narayana Murthy: వర్క్ ఫ్రమ్ హోం విధానంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆసక్తికర కామెంట్స్
Infosys
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 21, 2022 | 1:04 PM

కరోనా విజృంభణ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కు పలు సంస్థలు మొగ్గు చూపాయి. తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. అయితే కరోనా వ్యాప్తి తగ్గడం, టీకాలు వేయించుకోవడం వంటి కారణాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ కు కంపెనీలు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పని చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడ్డ ఉద్యోగులు.. ఆఫీస్(Office) కు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని రెగ్యులర్ చేయాలని కంపెనీ హెచ్ఆర్ ను సంప్రదిస్తున్నారు. దీని కోసం తమకు రావాల్సిన ప్రమోషన్లనూ కొందరు వదులుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయ‌ణ మూర్తి (Narayana Murty) మాత్రం భార‌తీయుల‌కు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ సూట్ అవదని అంటున్నారు. ఇటీవ‌ల అన్ని సంస్థలు వ‌ర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగుల్ని ఆఫీస్‌కు పిలిపించాయి. మ‌రి కొన్ని కంపెనీలు ఐబ్రిడ్ వ‌ర్క్ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ పరిస్థితులపై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇవంతి.. స‌ర్వే నిర్వహించింది. ఈ స‌ర్వేలో 71శాతం మంది ఉద్యోగులు త‌మ‌కు ఆఫీస్ లో ప‌నిచేయ‌డం కంటే ఇంటి వ‌ద్ద నుంచి ప‌నిచేయ‌డాన్ని ఇష్టప‌డుతున్నట్లు తేలింది.

గూగుల్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తామని మెయిల్స్ చేస్తున్నారు. 42శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్‌తో సంతోషంగా ఉన్నారు. 30శాతం మంది శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయాలని అనుకుంటున్నారు. 13 శాతం మంది మాత్రమే ఆఫీస్ కు రావాలనుకుంటున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా గతేడాది 24 శాతం మంది ఉద్యోగాలు వదిలేశారు. వచ్చే ఆరు నెలల్లో మరో 28 శాతం మంది జాబ్ వ‌దిలేసే ఆలోచన చేస్తున్నారు.

           – ఇవంతి నివేదిక

ఇంటి నుంచి పని చేసే విధానంపై ఇన్ఫోసిస్ ఫౌండ‌ర్ నారాయ‌ణ మూర్తి స్పందించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ప‌నిచేసే ప‌ద్ధతి ఇండియాకు అనుకూలం కాద‌ని అన్నారు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో ఉద్యోగుల ప్రొడ‌క్టివిటీ దెబ్బతింటుందన్న ఆయన.. సృజ‌నాత్మక‌త‌, నైపుణ్యం, ప్రతిభ, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుద‌ల సాధించ‌డం క‌ష్టమ‌ని అభిప్రాయపడ్డారు.

Also Read

Rashi Khanna: నేను కావాలనుకుంది ఒకటి, అయ్యింది మరొకటి.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Summer Health Tips: మండుతున్న ఎండలు.. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

Buttermilk soup: మజ్జిగ చారు.. టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో బెస్ట్

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..