Buttermilk soup: మజ్జిగ చారు.. టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో బెస్ట్

ప్ర‌స్తుత క‌రోనా రూపాలు మార్చుకుంటూ మనషులపై దాడి చేస్తుంది. ఈ స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డంపైనే అంద‌రూ దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఆహార అలవాట్ల విషయంపై జాగ్రత్తలు అవసరం.

Buttermilk soup: మజ్జిగ చారు.. టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో బెస్ట్
Buttermilk Soup
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 20, 2022 | 12:41 PM

Health Tips: ప్ర‌స్తుత క‌రోనా రూపాలు మార్చుకుంటూ మనషులపై దాడి చేస్తుంది. ఈ స‌మ‌యంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డంపైనే అంద‌రూ దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఆహార అలవాట్ల విషయంపై జాగ్రత్తలు అవసరం. మ‌నలో యాంటీబాడీస్ పుష్క‌లంగా ఉంటే అనుకోని ప‌రిస్థితుల్లో వైర‌స్ దాడి చేసినా..దాన్ని ఎదిరించ‌వ‌చ్చు. మ‌జ్జిగ చారు కూడా మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. కిచెన్ లో అందుబాటులో ఉండే వస్తువుల‌తోనే దీన్ని కొద్ది సమయంలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా లైట్‌గా మాత్రమే ఆయిల్ ఉంటుంది. కాగా పెరుగు లేదా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా మ‌న‌కు మేలు చేస్తుందున్న విష‌యం తెలిసిందే. పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా రెట్టింపు శాతంలో ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్జీరియాను నశింపజేయ‌డానికి స‌హ‌క‌రిస్తోంది. శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు ఎంట‌ర‌వ్వ‌కుండా ర‌క్ష‌ణగా నిలుస్తుంది. ఇక మజ్జిగలోని ల్యాక్టిక్‌ ఆమ్లం కొవ్వు పెరగకుండా సాయం చేస్తోంది. ఫుడ్ త్వరగా జీర్ణమయ్యేందుకు ఉప‌క‌రిస్తుంది. ఎండాకాలంలో బాడీలోని వేడిని త‌గ్గించ‌డంలో మ‌జ్జిగ చారు బేషుగ్గా పనిచేస్తుంది. మజ్జిగ చారు ద్వారా విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. అలాగే కాల్షియం శోషణను సులభం చేస్తుంది. ఎముకలు బలపడతాయి. మహిళలకు పీరియడ్స్ తర్వాత మజ్జిగ చారు తీసుకోవడం మంచిది. వంట ఇంట్లోనే రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోడానికి మంచి మార్గం ఉంటే. ఇంకా థింక్ చేస్తారెందుకు. ఇవాళే మ‌జ్జిగ చారుతో ఓ ప‌ట్టు ప‌ట్టేయండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: శ్రీవారి లడ్డూల తయారీకి కొత్త చిక్కు.. వినూత్న ఫార్ములాతో చెక్ పెట్టిన టీటీడీ