Rashi Khanna: నేను కావాలనుకుంది ఒకటి, అయ్యింది మరొకటి.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Rashi Khanna: ప్రతీ మనిషి జీవితంలో తనకు నచ్చింది కావాలని ఆశపడుతుంటాడు. కానీ పరిస్థితుల ప్రభావం, ప్రతికూల సమయం.. కారణం ఏదైనా అనుకున్నది కాకుండా మరొకటి అవుతుంటారు. ఈ అనుభవం చాలా మంది జీవితాల్లో ఎదురయ్యే ఉంటుంది. అయితే దీనికి తాను కూడా..
Rashi Khanna: ప్రతీ మనిషి జీవితంలో తనకు నచ్చింది కావాలని ఆశపడుతుంటాడు. కానీ పరిస్థితుల ప్రభావం, ప్రతికూల సమయం.. కారణం ఏదైనా అనుకున్నది కాకుండా మరొకటి అవుతుంటారు. ఈ అనుభవం చాలా మంది జీవితాల్లో ఎదురయ్యే ఉంటుంది. అయితే దీనికి తాను కూడా మినహాయింపు ఏం కాదంటోంది అందాల తార రాశీ ఖన్నా. తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. సినిమాల్లో హీరోయిన్‌గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న సమయంలోనే ఓటీటీ (OTT) బాట పట్టింది రాశీ. ఇటీవల బాలీవుడ్‌లో తెరకెక్కిన రుద్ర వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ.
ఈ నేపథ్యంలో తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కెరీర్ తొలి నాళ్లకు సంబంధించిన వివరాలను తెలుపుతూ.. ‘నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోనే ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చింది. అనంతరం, అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్‌తో నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను. ఆ తర్వాత నా ప్రయాణమంతా మీకు తెలిసిందే’ అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇక వెబ్ సిరీస్‌లో నటించడంపై స్పందించిన రాశీ.. ‘రుద్ర వెబ్ సిరీస్‌కు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. నేను పోషించిన ఆలియా చోక్సీ క్యారెక్టర్ మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదో విచిత్రమైన పాత్ర. ప్రేమలో ద్వేషం ఉంటుంది. కాఠిన్యంలో సున్నితత్వం తొంగిచూస్తుంది. ఆ పాత్రకు ఓకే చెప్పాక.. కొంచెం రిస్క్ చేస్తున్నానేమో అనిపించింది. అందుకు తగిన ప్రతిఫలం దక్కింది’ అని తెలిపిందీ అందాల తార.
View this post on Instagram
Also Read” Alia Bhatt: అలియా ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు !!