AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Rajkumar: పునీత్ ఇక్కడ లేనందుకు బాధగా ఉంది.. ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యిన శివన్న

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shiva Rajkumar: పునీత్ ఇక్కడ లేనందుకు బాధగా ఉంది.. ఆర్ఆర్ఆర్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యిన శివన్న
Shivaraj Kumar
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2022 | 3:39 PM

Share

Shiva Rajkumar : రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 25న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం చుట్టేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను కర్ణాటకలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తో పాటుగా పునీత్ రాజ్ కుమార్ అన్న హీరో శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా శివన్న మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.. ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది అన్నారు అలాగే ఈ సమయంలో నా తమ్ముడు అప్పు( పునీత్ రాజ్ కుమార్ )ఇక్కడ లేనందుకు చాలా బాధగా ఉంది.. పునీత్ ఉండి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు. నేను బాధపడితే మీరూ బాధపడతారు అందుకే నేను బాధపడను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాతో ఉగాది ఒక వారం ముందుగానే వచ్చింది ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం కోట్లమంది ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నా. ” అని శివ రాజ్ కుమార్ అన్నారు. ”భారతీయ సినిమా ఖ్యాతిని ‘బాహుబలి’ పెంచింది. తెలుగు చిత్ర పరిశ్రమ నా కుటుంబం. రాజమౌళికి నేనుపెద్ద అభిమానిని. పవన్ కళ్యాణ్- చిరంజీవి – అజిత్ – విజయ్ -ఎన్టీఆర్ – రామ్ చరణ్ – ఇలా ప్రతి ఒక్కరి సినిమాను నేను అభిమానులతో పాటు సినిమాలను చూడాలనుకుంటాను. ఫస్ట్ డే టికెట్ కొనుక్కొని మరీ థియేటర్ లలో చూస్తాను. నేను ఈ సినిమా కూడా థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నాను అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: రాజమౌళి-మహేష్‌ సినిమాలో బాలయ్య నటించనున్నారా.? క్లారిటీ ఇచ్చిన జక్కన్న..

Sreemukhi: అందాల ముద్దుగుమ్మ హొయలు కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. అదిరిన లేటెస్ట్ పిక్స్

Dasara Movie: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దసరా చిత్రయూనిట్.. ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టిన నేచురల్‌ స్టార్‌..