Indian Security Press: పదో తరగతి అర్హతతో.. ఇండియన్‌ సెక్యురిటీ ప్రెస్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.67,390ల జీతం..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెక్యురిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలోని ఇండియన్‌ సెక్యురిటీ ప్రెస్‌.. జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Indian Security Press: పదో తరగతి అర్హతతో.. ఇండియన్‌ సెక్యురిటీ ప్రెస్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.67,390ల జీతం..
Indian Security Press Nashik
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 10, 2022 | 3:04 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెక్యురిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలోని ఇండియన్‌ సెక్యురిటీ ప్రెస్‌.. 85 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెక్నికల్‌, కంట్రోల్‌, టెక్‌ సపోర్ట్‌-డిజైన్‌, మెషిన్‌ షాప్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. అంటే నవంబర్‌ 9, 1997 నుంచి నవంబర్‌ 8, 2004 సంవత్సరాల మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 8, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 2022 లేదా జనవరి 2023లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.18,780ల నుంచి రూ.67,390లు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.