Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Trap: ‘ఆమె’ వలలో ఎందరో బడా బాబులు.. సొగసైన మాటలతో ముగ్గులోకి దింపి ఆపై..

తన అందంతో, సొగసైన మాటలతో పలువురు రాజకీయ నాయకులను ముగ్గులోకి దింపింది. అనంతరం వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి దిగి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తున్న నిందితురాలిని భువనేశ్వర్‌ పోలీసులు గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో పలు కీలక విషయాలు..

Honey Trap: 'ఆమె' వలలో ఎందరో బడా బాబులు.. సొగసైన మాటలతో ముగ్గులోకి దింపి ఆపై..
Bhubaneswar Honey Trapp Cas
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 09, 2022 | 7:28 PM

తన అందంతో, సొగసైన మాటలతో పలువురు రాజకీయ నాయకులను ముగ్గులోకి దింపింది. అనంతరం వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి దిగి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తున్న నిందితురాలిని భువనేశ్వర్‌ పోలీసులు గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. నిందితురానికి భువనేశ్వర్‌లోని సత్య విహార్‌ ప్రాంతానికి చెందిన అర్చన నాగ్ (25)గా పోలీసులు గుర్తించారు. ఆమె దగ్గరి నుంచి ఫోన్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఐతే హై-ప్రొఫైల్ కస్టమర్ల పేర్లను మాత్రం ఆమె ఇంతవరకు వెల్లడించలేదని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ సౌమేంద్ర ప్రియదర్శి, డిప్యూటీ ప్రతీక్ సింగ్‌లలో ఎవ్వరూ మీడియాకు తెలుపలేదు. పలువురు సీనియర్ అధికారులు సైతం ఆమె అరెస్టును గోప్యంగా ఉంచడం గమనార్హం. ఈ విషయంపై పోలీసులు నోరు మెదపకపోవడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధార్థ్ దాస్ అనే సీనియర్ లాయర్‌ మాట్లాడుతూ.. ‘పోలీసులు నిందితులను అరెస్టు చేసినప్పుడల్లా, మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతూ.. ఫోటోలకు పోజులు ఇస్తారు. పోలీసధికారులు, రాజకీయ నాయకులతో సహా కొంతమంది ప్రముఖుల పేర్లు హనీ ట్రాప్ కేసులో చక్కర్లు కొడుతున్నందున పోలీసులు కేసు తాలూకు విషయాలను రహస్యంగా ఉంచుతున్నారు. ఆమెను రహస్యంగా కోర్టులో హాజరుపరిచినట్లు’ తెలిపారు.

నిందితురానికి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల వంటి సామాజిక మాద్యమాల ద్వారా సంపన్నులు, ఉన్నతాధికారులతో తొలుత స్నేహం చేస్తుంది. తర్వాత మాటలతో ముగ్గులోకి దింపి తన ఇంటికి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా మెలిగి వాటిని రహస్యంగా రికార్డు చేసేది. ఆ తర్వాత వాటి ద్వారా డబ్బు డిమాండ్‌ చేసేంది. అడిగినంత ఇవ్వకపోతే వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో ఉంచుతానని బెదిరింపులకు దిగేది. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డు వంటి ఖరాదైన కంపెనీల కార్లు ఉన్నాయి. భువనేశ్వర్‌లో లగ్జరీ ఫార్మ్‌ హౌస్‌ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఆమె భర్త కోసం పోలీసుల వెతుకులాట.. హనీ ట్రాప్ గ్యాంగ్‌లో భాగమైన ఆమె భర్త జగబంధు చంద్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం. ఈ ముఠాలో కొందరు మహిళలు ఉన్నారు. వీరి ద్వారా సోషల్ మీడియాలో హై-ప్రొఫైల్ వ్యక్తులను హనీ ట్రాప్ చేసి, వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి దోపిడీకి పాల్పడతారు.