ICMR-NIE Jobs 2022: టెన్త్/ఇంటర్/డిగ్రీ అర్హతతో నెలకు రూ.లక్షన్నర జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన 18 ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేసన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏఎన్‌ఎం, ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 28 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితి విషయంలో రిజర్వేషన్ అభ్యర్ధులకు సడలింపు వర్తిస్తుంది.ఈ అర్హతలున్నవారు కింది ఈమెయిల్ ద్వారా అక్టోబర్ 12, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఈ మెయిల్ ఐడీ: ieprojectcell@nieicmr.org.in
ఖాళీల వివరాలు..
- ప్రాజెక్ట్ సైంటిస్ట్- సి(నాన్- మెడికల్) (డేటా అనలిస్ట్) పోస్టులు: 1
- ప్రాజెక్ట్ సైంటిస్ట్- సి (నాన్-మెడికల్) పోస్టులు: 1
- ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-బి) పోస్టులు: 4
- ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు: 2
- ప్రాజెక్ట్ టెక్నీషియన్-3(ఫీల్డ్ వర్కర్) పోస్టులు: 6
- ప్రాజెక్ట్ కన్సల్టెంట్-1 పోస్టులు: 2
- ప్రాజెక్ట్ జూనియర్ నర్స్ పోస్టులు: 1
- ప్రాజెక్ట్ కన్సల్టెంట్(మెడికల్/ నాన్-మెడికల్) పోస్టులు: 1
జీతభత్యాల వివరాలు..
- సైంటిస్ట్ సీ పోస్టులకు నెలకు రూ.51,000
- సైంటిస్ట్ బీ పోస్టులకు నెలకు రూ.48,000
- ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్ బి) పోస్టులకు నెలకు రూ.18,000
- రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.31,000
- ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు నెలకు రూ.1,50,000లతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.