Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Time Travel: ఈ ఏడాది డిసెంబర్‌ 8న ఏం జరగబోతోంది? భూమిపైకి ఏలియన్స్‌ వచ్చే సమయం ఆసన్నమైందా..

సినిమాలు, నవలల్లో కాకుండా ఇలలో టైమ్ ట్రావెల్‌ నిజంగా సాధ్యమవుతుందా? కాలంలోకి ప్రవేశించి ముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవడం మానవమాత్రులకు సాధ్యమేనా? ఇటువంటి సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా? ఐతే మీకు ఈ విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం..

Time Travel: ఈ ఏడాది డిసెంబర్‌ 8న ఏం జరగబోతోంది? భూమిపైకి ఏలియన్స్‌ వచ్చే సమయం ఆసన్నమైందా..
Time Traveller Prediction
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 10, 2022 | 2:28 PM

సినిమాలు, నవలల్లో కాకుండా ఇలలో టైమ్ ట్రావెల్‌ నిజంగా సాధ్యమవుతుందా? కాలంలోకి ప్రవేశించి ముందు ఏం జరిగిందో, తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవడం మానవమాత్రులకు సాధ్యమేనా? ఇటువంటి సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా? ఐతే మీకు ఈ విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అన్నమాట. ఎందుకంటే ఓ వ్యక్తి తాను టైం ట్రావెలర్‌ నని చెప్పుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఇంటర్నెట్‌లో వెలసిన ఈ టైం ట్రావెలర్‌ గురించి ప్రస్తుతం ప్రపంచమంతా చర్చించుకుంటోంది. అతనెవరంటే..

సదరు టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలైరిక్‌. అతను ఇటీవల టిక్‌టాక్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. భూమి భవిష్యత్తు మర్చేసే 5 విపత్తుల గురించిన 5 హెచ్చరికలు తన టిక్‌టాక్‌ వీడియోలో తెలిపాడు. మానుషులు గ్రహాంతరవాసులతో (ఏలియన్స్‌) సంఘర్షణ పడటానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉన్నాయని జ్యోతిష్యం పలికాడు. ఏలియన్స్‌ భూమిపైకి వచ్చే తేదీని కూడా తెలిపాడు. ఈ ఏడాది డిసెంబరు 8న ఏలియన్స్‌ భూమిపైకి వస్తారని చెప్పాడు.

టైమ్ ట్రావెలర్ హెచ్చరికలు జారీ చేసిన రోజులు ఇవే..

ఇవి కూడా చదవండి

2,671వ సంవత్సరం నుంచి తాను రియల్ టైమ్ ట్రావెలర్‌గా ఉన్నాడని, రాబోయే ఈ ఐదు తేదీల్లో తప్పక గుర్తుంచుకోవల్సిందిగా తెలిపాడు. ఈ 5 తేదీల్లో ఒక్కో రోజున ఏం జరగబోతోందంటే..

  • నవంబర్ 30, 2022: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భూమిని పొలిన మరో గ్రహాన్ని కనుగొంటుంది.
  • డిసెంబర్ 8, 2022: కొత్త లోహాలు, గ్రహాంతర వాసులతో కూడిన పెద్ద ఉల్క భూమిపైకి చేరుకుంటుంది.
  • ఫిబ్రవరి 6, 2023: నలుగురు యువకుల బృందం పురాతన శిధిలాలను, ఇతర గెలాక్సీలకు వార్మ్‌హోల్‌ను తెరిచే పరికరాన్ని కనుగొంటారు.
  • మార్చి 23, 2023: మరియానా ట్రెంచ్‌ను వెదుకుతున్న శాస్త్రవేత్తల బృందం పురాతన జాతులను కనుగొంటుంది.
  • మార్చి, 2023: అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 750 అడుగుల మెగ -సునామీ తలెత్తుతుంది

ప్రస్తుతం ఈ టైం ట్రావెలర్‌కు సంబంధించిన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్వయం ప్రకటిత టైంట్రావెలర్‌లలో ఇతను తొలి వ్యక్తి కాదు. అవును.. గతంలో కూడా పలువురు వ్యక్తులు భవిష్యత్తు గురించి హెచ్చరికలు జారీ చేయండ జరిగింది. వచ్చే ఏడాది 3-అడుగుల సాలీడు, 18 అడుగుల బీట్, ఒక అడుగు పొడవున్న చీమను భూమిపై సంచరిస్తాయనే వార్తలను కూడా ఈ స్వయం ప్రకటిత టైంట్రావెలర్‌ ఖాతాలో ఉండటం విశేషం.