Mexico: స్కూల్ స్టూడెంట్స్ పై విష ప్రయోగం.. ఒకరి పరిస్థితి విషమం.. అనుమానాలు వ్యక్కతం చేస్తున్న పేరెంట్స్..
చక్కగా చదువుకోవాల్సిన పాఠశాలలో ఆ చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల సంరక్షణలో సురక్షితంగా ఉండాల్సిన ఆ విద్యార్థులకు సేఫ్ లేకుండా పోయింది. గుర్తు తెలియనని పదార్థంతో వారిపై...

చక్కగా చదువుకోవాల్సిన పాఠశాలలో ఆ చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల సంరక్షణలో సురక్షితంగా ఉండాల్సిన ఆ విద్యార్థులకు సేఫ్ లేకుండా పోయింది. గుర్తు తెలియనని పదార్థంతో వారిపై విష ప్రయోగం జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన మెక్సికో లో జరిగింది. సౌత్ మెక్సికన్ రాష్ట్రంలోని చియాపాస్‌లో ఉన్న ఓ పాఠశాలలో విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని పదార్థంతో ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు విష ప్రయోగానికి కారణమైన పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని ల్యాబ్ కు పంపించి తనిఖీ చేయగా కొకైన్ పాజిటివ్‌గా తేలింది. అయితే.. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవటం వల్లే తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాగా.. విష ప్రయోగం జరిగిన వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. మరోవైపు.. విద్యార్థులపై విష ప్రయోగం జరగటం రెండు వారాల్లో ఇది మూడోది కావడం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో బోచిన్ ప్రాంతానికి చెందిన 57 మంది చిన్నారులు విష ప్రయోగం జరిగిన లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారు, ఒక విద్యార్థిని ఉన్నతాసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని మెక్సికన్ సోషల్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. శనివారం 15 మందిపై విష నిర‍్ధరణ పరీక్షలు నిర్వహించారు. వారందరికీ నెగెటివ్‌గా తేలింది. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పమంటే అధికారుల నుంచి సరైన సమాధానం ఉండడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి