Dr. RMLIMS Recruitment 2022: డిగ్రీ అర్హతతలో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 534 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. 534 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది...

లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. 534 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్ బి (న్యూక్లియర్ మెడిసిన్), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ ఏ (రేడియేషన్ అంకాలజీ), సైంటిస్ ఏ (రీసెర్చ్ ఆఫీసర్), వెటర్నరీ ఆఫీసర్, సిస్టర్ గ్రేడ్-II, అసిస్టెంట్ డైటీషియన్, లైబ్రేరియన్ గ్రేడ్-3, స్టోర్ కీపర్ కమ్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), స్టాటిస్టికల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్-3, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, లోయర్ డివిజన్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతలు, ఎంపిక విధానం, జీతభత్యాలు, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ రెండో లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇతర సమాచారం అధికారికంగా విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.