IREL Recruitment: ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.

IREL Recruitment 2021: ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తమిళనాడులో ఉన్న ఈ సంస్థలో...

IREL Recruitment: ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.
Irel Recruitment 2021
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jul 16, 2021 | 12:04 PM

IREL Recruitment 2021: ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తమిళనాడులో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 21 ఖాళీలకు గాను ట్రేడ్‌ అప్రెంటిస్‌ (20), టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (ఎలక్ట్రికల్‌)– (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులకు గాను ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, వెల్డర్, టర్నర్, ప్లంబర్, కార్పెంటర్, ల్యాబ్‌ అసిస్టెంట్‌(కెమికల్‌) పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అదే విధంగా ల్యాబ్‌ అసిస్టెంట్‌(కెమికల్‌) పోస్టులకు బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. * టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. * అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో ఫామ్‌ ఫిల్‌ చేసి అనంతరం దాంతో పాటు సంబంధిత డ్యాక్యుమెంట్లను జత చేసి ఆఫ్‌లైన్‌ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. * దరఖాస్తును ది మేనేజర్ (పర్సనల్‌), ఐఆర్‌ఈఎల్‌ (ఇండియా) లిమిటెడ్‌, మనవాలకురిచి, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు– 629252 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * అభ్యర్థులను అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 31.08.2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Surekha Sikri Dies : ‘చిన్నారి పెళ్లి కూతురి’ బామ్మగారు సురేఖా సిక్రీ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

Medchal: మా గొప్ప డాక్టర్.. విరిగింది ఒక కాలు అయితే మరో కాలుకు సర్జరీ..

Contraceptive Antibodies: ప్రత్యేక గర్భనిరోధక యాంటీబాడీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..ఇది ఎలా పనిచేస్తుందని చెబుతున్నారంటే..