AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tutoroot: ఉపాధ్యాయులకు శుభవార్త.. ట్రైన్ ది టీచర్‌ పేరుతో ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్

Tutoroot: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ 'ట్రైన్ ది టీచర్' పేరుతో ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది ఎడ్‌టెక్ స్టార్టప్ ట్యూటరూట్. ఉపాధ్యాయులు, పాఠశాలలు ఈ ఉచిత..

Tutoroot: ఉపాధ్యాయులకు శుభవార్త.. ట్రైన్ ది టీచర్‌ పేరుతో ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 15, 2021 | 9:55 PM

Tutoroot: ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ ‘ట్రైన్ ది టీచర్’ పేరుతో ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది ఎడ్‌టెక్ స్టార్టప్ ట్యూటరూట్. ఉపాధ్యాయులు, పాఠశాలలు ఈ ఉచిత ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. అయితే చాలావరకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్ బోధనలో శిక్షణ తీసుకోవచ్చు. వారికి ఆన్‌లైన్‌లో తరగతుల్ని ఎలా తీసుకోవాలనే అవగాహన కల్పించేందుకు ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో బోధించడం నుంచి టెస్టులు ఎలా నిర్వహించాలి, అసెస్‌మెంట్ ఎలా నిర్వహించాలనేదానిపై అవగాహన పొందవచ్చు.

బీఎస్ఈలో లిస్ట్ అయిన ఐటీ సర్వీసెస్ కంపెనీ గ్లోబల్ టెక్నాలజీస్‌కు చెందిన ఎడ్‌టెక్ స్టార్టప్ ట్యూటరూట్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా గ్లోబల్ టెక్నాలజీస్‌ ఎడ్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించింది. సీవీఐఏసీ టెక్నాలజీస్, స్కూల్స్ ఫర్ ఇండియా ట్రస్ట్‌తో కలిసి ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అందిస్తోంది. త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2021 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో సేవలు అందించనుంది.

‘ట్రైన్ ది టీచర్’ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో మొత్తం 12 సెషన్లు ప్రోగ్రామ్ ఉంటుందని ప్రోగ్రాం అధికారులు తెలిపారు. ఒక్కో సెషన్ ఓ గంట మాత్రమే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులకు సర్టిఫైడ్ వర్చువల్ టీచర్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ తర్వాత ఉపాధ్యాయులు లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ టూల్స్ ద్వారా తరగతులు నిర్వహించవచ్చు. లైవ్ ఇంటరాక్టీవ్ తరగతులు, అడాప్టీవ్ అసెస్‌మెంట్స్, లైవ్ సిమ్యులేషన్, సబ్జెక్ట్ డెమొ వీడియోస్, ఐఐటీ జేఈఈ, నీట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీసీఎస్ఈ, ఐబీ కరుక్యులమ్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోర్స్‌వేర్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఆసక్తిగల ఉపాధ్యాయులు https://www.tutoroot.com/vmentor వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

JEE Mains: జేఈఈ పరీక్షల తేదీల్లో మార్పులు.. ఆగస్టు నెలాఖరుకు వాయిదా వేసిన కేంద్ర విద్యాశాఖ

Hyderabad IT Hub: హైదరాబాద్ శివారులో మరో ఐటీ హబ్.. పది లక్షల మందికి ఉద్యోగాలు.. ఫ్లాన్ రెడీ చేసిన హెచ్ఎండీఏ!