IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ. ఇలా అప్లై చేసుకోండి.

IOCL Recruitment 2021: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 480 పోస్టులను...

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ. ఇలా అప్లై చేసుకోండి.
Iocl Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 16, 2021 | 5:43 PM

IOCL Recruitment 2021: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 480 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖాళీలున్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * దీనిద్వారా తమిళనాడు, పాండిచ్చరీ, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. * ఫిట్టర్‌, ఎలక్ట్రిషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఇన్స్‌ట్రుమెంట్‌ మెకానిక్‌, సివిల్‌, డేటా ఎంట్రీ, రిటైల్‌ సేల్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థులు పోస్టు ఆధారంగా ఆయా విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 60 ఖాళీలు ఉన్నాయి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. * అభ్యర్థులను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్‌ ఫార్మాట్‌లో ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 13, 2021న ప్రారంభం కాగా.. ఆగస్టు 28, 2021 చివరి తేదీగా ప్రకటించారు. * రాత పరీక్షను సెప్టెంబర్‌ 19, 2021న నిర్వహిస్తారు. డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ సెప్టెంబర్‌ 27, 2021న ఉంటుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..  * నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Pakistan PM Imran Khan: వాళ్ళు బానిస సంకెళ్లను తెగ గొట్టారు..తాలిబన్లకు పక్కదేశం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాసట

Afghan Crisis: ఆప్ఘాన్ పరిణామాలతో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉందంటే..

Taliban – China: చైనా తోక వంకర.. తాలిబన్ రాక్షసులతో స్నేహం చేస్తామంటూ డ్రాగన్ దేశం ప్రకటన