Taliban – China: చైనా తోక వంకర.. తాలిబన్ రాక్షసులతో స్నేహం చేస్తామంటూ డ్రాగన్ దేశం ప్రకటన

Taliban - China: చైనా తోక వంకర.. తాలిబన్ రాక్షసులతో స్నేహం చేస్తామంటూ డ్రాగన్ దేశం ప్రకటన
Afghanistan Talibans

ఆఫ్గనిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లతో స్నేహ సంబంధాలకు తాము సిద్ధమని చైనా ప్రకటించింది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో మీకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఆఫ్ఘన్ అభివృద్ధిలో మీరు మా భాగస్వామ్యాన్ని అంగీకరిస్తున్నారని, ఇది స్వాగతించదగినదని

Umakanth Rao

| Edited By: Anil kumar poka

Aug 16, 2021 | 4:58 PM

Afghanistan Crisis: చైనా తన కుటిల మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టింది.తన స్వార్థ ప్రయోజాల కోసం ఎలాంటి అడ్డమైన గడ్డి తినేందుకు వెనుకాడదని డ్రాగన్ దేశం చాటుకుంది.  ఆఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న  తాలిబన్లతో స్నేహ సంబంధాలకు తాము సిద్ధమని ప్రకటించింది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో మీకు సహకరిస్తామంటూ హామీ ఇచ్చింది. ఆఫ్ఘన్ అభివృద్ధిలో ఆఫ్గన్ తమ భాగస్వామ్యాన్ని అంగీకరిస్తోందని, ఇది స్వాగతించదగినదిగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మహిళా అధికార ప్రతినిధి హువా చున్ ఇంగ్ పేర్కొన్నారు. కొన్ని తరాలుగా పెద్ద దేశాల ‘పిడికిలి’ లో చిక్కుకున్న ఆఫ్ఘానిస్తాన్ తో సంబంధాలను పెంచుకోవడం తమకు కూడా అంగీకారయోగ్యమేనని ఆమె పేర్కొన్నారు. సజావుగా అధికార మార్పిడి జరిగేలా. అరమరికలు లేని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మీ హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు.

ఆఫ్ఘన్లు, విదేశీయుల భద్రతకు ముప్పు రాకుండా చూడాలని తాలిబన్లను చైనా కోరింది. గత నెలలో తాలిబన్ అధికార ప్రతినిధి బృందమొకటి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ని తియాంజిన్ లో కలిసి ..మిలిటెంట్లకు స్థావరంగా ఆఫ్ఘన్ గడ్డను వినియోగించుకోవడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఇందుకు బదులుగా ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి పెట్టుబడుల రూపంలో తాము సహకరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. కాబూల్ లోని అన్ని దేశాల రాయబార కార్యాలయాలు మూత పడినప్పటికీ చైనా ఎంబసీ మాత్రం పని చేస్తోంది. కొన్ని నెలల క్రితమే చైనా తమ దేశస్థులను ఇక్కడి నుంచి తరలించింది. అయితే కాబూల్ లోని పరిస్థితిని గమనిస్తుండాలని, ఇళ్లలోనే ఉండాలని ఈ ఎంబసీ ఇంకా మిగిలి ఉన్న చైనీయులను కోరింది.

ఇలా ఉండగా తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని బ్రిటన్ పేర్కొంది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ మేరకు ప్రకటన చేశారు,

మరిన్ని ఇక్కడ చూడండి : పాగల్ ప్రేమికుడు విశ్వక్ సేన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ :Vishwak Sen Exclusive Interview Video.

 టాయిలెట్‌లో గంటల కొద్దీ గడిపే భ‌ర్త‌.. భార్య ఏం చేసిందంటే..?వైరల్ వీడియో..:Husband Spends Hours in Toilet Video.

 డ్యాన్సులతో రచ్చ చేస్తున్న సింగిల్ చిన్నోడు.. వైరల్ అవుతున్న పాగల్ డాన్స్ వీడియో..:Vishwak Sen Dance Video.

 కారుతో ఎస్ఐని ఢీకొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో చేసారా..?కావాలని చేసారా..?(వీడియో):Hit SI with Car Video.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu