అయ్యో.. విమానం రెక్కలపై నుంచి జారి పడ్డారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నం విఫలం..

అయ్యో.. విమానం రెక్కలపై నుంచి జారి పడ్డారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నం విఫలం..
Afghanistan Three Afghan

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ల ఆక్రమణ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఇంతలో కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరిన విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులు కిందపడ్డారు.

Sanjay Kasula

|

Aug 16, 2021 | 5:34 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ల ఆక్రమణ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఇంతలో కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరిన విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులు కిందపడ్డారు. ఈ ప్రయాణీకులు విమానం లోపల చోటు లభించక పోడంతో వీరంతా విమానం రెక్కలపై కూర్చున్నారు. విమానం గాలిలో టాకాఫ్ అయిన కాసేపటికే వారిలో ముగ్గురు కింద పడిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అంతర్జాతీయ మీడియా ఈ విజువల్స్‌ను ప్రముఖంగా ప్రసారం చేస్తోంది. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు పడిపోవడం చూడవచ్చు. తాలిబన్లు రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దేశం విడిచి వెళ్లడానికి ప్రజలు విమానాశ్రయానికి పరగులు పెడుతున్నారు.

యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో వివిధ సరిహద్దు క్రాసింగ్‌లను తాలిబాన్లు ఆక్రమించినప్పటి నుంచి ప్రజలు బయటకు రావడానికి ఆందోళన చెందుతున్నారు. తాలిబన్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు తమ మాతృభూమి(ఆఫ్ఘనిస్తాన్‌)ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి కాబోల్ విమానాశ్రయం ఒక్కటే మార్గం. పెద్ద సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం వైపు వెళ్లడానికి ఇదే కారణం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో భారీ సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం వైపు పరుగెత్తుతున్నట్లు చూడవచ్చు. అదే సమయంలో విమానంలోకి చేరుకోవడానికి ప్రజలు ఒకరిపై ఒకరు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇది చూస్తే కాబూల్‌లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.

కాబూల్ విమానాశ్రయంలో ఫైరింగ్..

అదే సమయంలో న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో  కాల్పుల్లో కనీసం ఐదుగురు మరణించారని తెలుస్తోంది. ఆఫ్ఘన్ రాజధాని నుండి బయలుదేరిన వందలాది మంది ప్రజలు బలవంతంగా విమానాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. ఈ సమయంలో వారిపై బుల్లెట్లు పేలాయి. అదే సమయంలో మరో ప్రత్యక్ష సాక్షి ఐదుగురి మృతదేహాలను వాహనాల్లో తీసుకెళ్లడం చూశానని చెప్పాడు. అయితే.. కాబూల్ విమానాశ్రయం నియంత్రణ మాత్రం ఇప్పటికీ అమెరికన్ సైనికుల చేతిలో ఉంది. అదే సమయంలో  అమెరికా అధికారులు ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ కోరుకుంటున్నది..

మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్‌లో ‘ఓపెన్, సమ్మిళిత ఇస్లామిక్ ప్రభుత్వం’ ఏర్పాటు లక్ష్యంతో తీవ్రవాద సంస్థ చర్చలు జరుపుతోందని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహిన్ తెలిపారు. కొద్ది రోజుల్లో తాలిబాన్లు దేశంలోని చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుని రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తర్వాత షహీన్ ఈ విషయం  వెల్లడించారు. అంతకుముందు ఈ సంస్థ రాష్ట్రపతి భవన్ నుండి కొత్త ప్రభుత్వాన్ని ప్రకటిస్తుందని తాలిబాన్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఆ ప్రణాళిక ప్రస్తుతానికి నిలిపివేయబడినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో అల్-జజీరా న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన చిత్రాలలో రాష్ట్రపతి భవన్ లోపల తాలిబాన్ ఉగ్రవాద బృందం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి: Pope Francis : పోప్‌ ఫ్రాన్సిస్‌‌కి ఏమైంది..! రోమ్‌లోని ఆస్పత్రిలో ఎందుకు చేరారు..? శస్త్ర చికిత్స కచ్చితంగా అవసరమా..?

Viral Video: మాస్క్‌ని ఇలా కూడా ఉపయోగిస్తారా? వీళ్ల తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu