Taliban: ఆఫ్ఘన్‌లో మళ్ళీ తాలిబన్ల అరాచక రాజ్యం..తాలిబన్లు అంటే ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరగబోతోంది..

'ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యాల స్మశానం' ఇది చాలా పాతకాలం నాటి సామెత. ఇప్పుడు ఇది ఈ యుగంలో కూడా నిజమని నిరూపితమైంది.

Taliban: ఆఫ్ఘన్‌లో మళ్ళీ తాలిబన్ల అరాచక రాజ్యం..తాలిబన్లు అంటే ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరగబోతోంది..
Taliban
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 16, 2021 | 6:36 PM

Taliban: ‘ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యాల స్మశానం’ ఇది చాలా పాతకాలం నాటి సామెత. ఇప్పుడు ఇది ఈ యుగంలో కూడా నిజమని నిరూపితమైంది. అలెగ్జాండర్, మొఘల్, బ్రిటిష్, సోవియట్ యూనియన్ తర్వాత అమెరికా అందుకు ఇటీవలి తాజా ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా 61 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. 2,300 మందికి పైగా అమెరికన్ సైనికులు మరణించారు. చివరికి ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. అమెరికాను 20 సంవత్సరాల పాటు దేశం విడిచి వెళ్ళమని ఒత్తిడి చేసిన సమూహం పేరు – తాలిబాన్. .

ఒక రోజు ముందు అంటే ఆగష్టు 15, 2021 నాటికి  తాలిబన్లు రాజధాని కాబూల్‌తో సహా మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్లతో ఒప్పందానికి అంగీకరించింది. మరోసారి, తాలిబాన్ల అధికారం ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరపడిందని ప్రస్తుత పరిణామాలు చూస్తే ఒప్పుకుని తీరాల్సిందే.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి తాలిబాన్ పేరు మారుమోగుతోంది. ఇరవై ఏళ్లపాటు అమెరికా సైన్యాన్ని అడ్డుకుని.. నిలబడటం అంటే మామూలు విషయం కాదు. అదలా ఉంచితే.. అసలు తాలిబాన్ అంటే ఏమిటి? దాని చరిత్ర.. అది ఎలా పనిచేస్తుంది.. దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. సుదీర్ఘ పోరాటాలు ఎలా చేయగలుగుతుంది సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. తాలిబాన్ అంటే ఏమిటి?

అది 980 ల ప్రారంభం. సోవియట్ యూనియన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వం అప్పటికి సోవియట్ రక్షణలో నడుస్తోంది. అనేక ముజాహిదీన్ గ్రూపులు.. సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ ముజాహిదీన్‌లు అమెరికా, పాకిస్తాన్ నుండి సహాయం పొందారు. 1989 నాటికి సోవియట్ యూనియన్ తన బలగాలను ఉపసంహరించుకుంది. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులు అప్పుడు తమలో తాము పోరాడటం ప్రారంభించారు. అలాంటి పోరాట యోధుడు ముల్లా మహ్మద్ ఉమర్. అతను కొంతమంది పస్థూన్ యువకులతో తాలిబాన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.

2. తాలిబాన్ ఎలా పని చేస్తుంది?

అన్ని దేశాల్లోని ప్రభుత్వాల్లానే, తాలిబాన్ కూడా నడుస్తుంది. దీనికి సంస్థ అధిపతి ఉన్నారు. ఆ తర్వాత ముగ్గురు డిప్యూటీ నాయకులు ఉన్నారు. వారికి నాయకత్వ మండలి ఉంది, దీనిని రహబరి షురా అంటారు. ఆ తర్వాత వివిధ శాఖల కమిషన్లు ఉన్నాయి. ప్రతి ప్రావిన్స్‌కు ప్రత్యేక గవర్నర్లు , కమాండర్లను  కూడా నియమించుకున్నారు.

3. తాలిబాన్ల భావజాలం ఏమిటి?

ఆప్ఘనిస్తాన్ 1996 నుంచి 2001 వరకూ తాలిబాన్ ఏలుబడిలో ఉంది. ఆ సమయంలో తాలిబాన్ లు తమదైన భావజాలంతో దేశాన్ని పాలించారు. వారు ఏం చేశారంటే..

  • అక్కడి మహిళలు ఎట్టిపరిస్థితిలోనూ స్కూలుకు వెళ్లి చదువుకోవడం కానీ, ఉద్యోగాలు చేయడం కానీ చేయకూడదు.
  • అక్కడి పురుషులు తప్పనిసరిగా నమాజ్ చేయాలి. అదేవిధంగా పొడవాటి గడ్డం పెంచటం తప్పనిసరి. ఇంకా చెప్పాలంటే గడ్డం తీయడం అక్కడ నేరం.
  • అక్కడ ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకపోతే కఠిన శిక్షలు అమలు చేసేవారు. దాదాపుగా మరణ శిక్షే ఎక్కువగా విధించేవారు. అయితే, ఈ శిక్షలు కూడా బహిరంగంగా అమలు చేసేవారు.
  • హత్యాయత్నం చేసినా.. దొంగతనం చేసినా ఆ వ్యక్తి వెళ్ళాను బహిరంగంగా నరికేయడం ఒక శిక్ష.
  • ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన సమయంలో ప్రపంచంలోని ఉగ్రవాదులందరికీ ఆశ్రయం కల్పించారు.

4. తాలిబాన్ దగ్గర ఎన్ని నిధులు ఉన్నాయి?

తాలిబన్లు తమ ఖాతాల వివరాలను ప్రచురించరు. వారి ఖచ్చితమైన ఆదాయాలు, ఆస్తులను నిర్ధారించడం కష్టం.  2016 లో, ఫోర్బ్స్ తాలిబాన్ల వార్షిక టర్నోవర్ రూ .2,968 కోట్లుగా అంచనా వేసింది. రేడియో ఫ్రీ యూరోప్ పొందిన నాటో యొక్క రహస్య నివేదిక ప్రకారం, 2019-20లో తాలిబాన్ల వార్షిక బడ్జెట్ దాదాపు 11 వేల కోట్లు. వారి సంపాదనలో ప్రధాన వనరులు ఏమిటో తెలుసుకుందాం …

ప్రపంచంలో నల్లమందు ఉత్పత్తిలో 80% ఆఫ్ఘనిస్తాన్‌లోనే అవుతుంది.

* చాలా నల్లమందు సాగు ప్రాంతాలు తాలిబాన్ నియంత్రణలో ఉన్నాయి 

* నల్లమందు వ్యాపారుల నుండి తాలిబాన్ పన్ను వసూలు చేస్తుంది

* తాలిబాన్ ప్రాంతాలలో సరిహద్దు పోస్టుల వద్ద వ్యాపారులు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది

* సైనిక పోస్ట్ లేదా పట్టణ ప్రాంతంలో నివాసితుల ఆస్తులను తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడం ద్వారా మొత్తం ఆస్తిని తీసుకుంటారు తీసుకుంటాడు

* ఆఫ్ఘనిస్తాన్‌లో అక్రమ మైనింగ్ తో కంపెనీల నుండి తాలిబాన్ పన్ను వసూలు చేస్తుంది. 

5. అమెరికా..తాలిబాన్ల మధ్య 20 సంవత్సరాల యుద్ధం

సెప్టెంబర్ 11, 2001 న, 19 మంది ఉగ్రవాదులు 4 యుఎస్ ప్యాసింజర్ విమానాలను హైజాక్ చేశారు. వీటిలో రెండు విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో, ఒక విమానం పెంటగాన్‌లో.  ఒక విమానం తెలియని ప్రదేశంలో కూలిపోయాయి. ఈ దాడిలో 2996 మంది మరణించారు. ఈ దాడి వెనుక అల్ ఖైదా హస్తం ఉంది. ఒసామా బిన్ లాడెన్ హతం చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అతని జాడకోసం వెదుకులాట మొదలు పెట్టింది.  ఒసామా మొదట సూడాన్‌లో దాక్కున్నాడు, తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందాడు. దీని గురించి తెలుసుకున్న అమెరికా, ఆఫ్ఘనిస్తాన్‌పై విరుచుకుపడింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు పరిపాలించారు.

6. అక్టోబర్ 2001… అమెరికా నేతృత్వంలో నాటో ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది

* ఆఫ్ఘనిస్తాన్ నుండి కేవలం 3 నెలల్లో తాలిబాన్ పాలన ముగిసింది * తాలిబాన్ మరియు అల్ ఖైదా అగ్ర నాయకులు పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరానికి పారిపోయారు

2002

సెప్టెంబర్‌లో కాబూల్‌లో తాలిబాన్ అనేక దాడులు చేసింది. నాటో శిబిరాలతో సహా అనేక చోట్ల ఈ దాడులు సాగించింది.

2003

యుఎస్ డ్రోన్ దాడిలో తాలిబాన్లు ఎక్కువగా మరణించారు. వారిలో పెద్ద నాయకుడు హకీముల్లా మసూద్ కూడా ఉన్నారు.

2005

ఆగస్టులో, తాలిబాన్లు ముల్లా మన్సూర్‌ను చంపారు. తరువాతగా దాని కొత్త నాయకుడి ఎన్నికను ప్రకటించింది

* మే 2006 లో యుఎస్ డ్రోన్ దాడిలో ముల్లా మన్సూర్ కూడా మరణించాడు

2003 – 2019 సంవత్సరాల మధ్యలో..

* ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా మొత్తం 61 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

* 2300 మందికి పైగా అమెరికన్ సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.

* 64,00 కంటే ఎక్కువ మంది ఆఫ్ఘన్‌లు సైనికులు, పోలీసులు మరణించారు.

అమెరికా -నాటో దేశాల సైనికులు మేలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి మరలడం ప్రారంభం అయింది. 

* అప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ ఒంటరి అయిపొయింది. వివిధ నగరాల్లో తాలిబాన్ల ప్రభావం కనిపించడం ప్రారంభం అయింది.

తాలిబాన్లు హెరాత్, కాందహార్, కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి 34 లో 24 ప్రావిన్సులను ఆక్రమించింది.

ఇప్పుడు తాలిబన్లు ఏమి చేయబోతున్నారనే అంచనా ఇది. 

* చైనా, రష్యాతో  దౌత్యం పెంచడానికి తాలిబన్లు  ప్రయత్నిస్తున్నారు

* తాలిబాన్ ఎజెండాతో మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ లోపాలను కొనసాగించేందుకు సమాయత్తం అవుతున్నారు.

* 1996 నుండి 2001 వరకు అధికారంలో ఉన్న తాలిబన్లు.. ఈసారి కూడా ఎప్పటిలానే ఆప్ఘనిస్తాన్ లో తమదైన కఠిన మత చట్టాలను అమలు చేసే అవకాశం ఉంది.

Also Read: Afghanistan: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురు దుర్మరణం

ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు