ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత
అసలే ఆఫ్ఘన్ లోని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న అక్కడి భారతీయులకు మరో షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ ను మూసివేసిన కారణంగా అక్కడి విమానాశ్రయం నుంచి ఏ విమానాన్నీ నడపలేమని ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు.
అసలే ఆఫ్ఘన్ లోని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న అక్కడి భారతీయులకు మరో షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ ను మూసివేసిన కారణంగా అక్కడి విమానాశ్రయం నుంచి ఏ విమానాన్నీ నడపలేమని ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. అంటే ఆ ఎయిర్ పోర్టులో ఏ విమానం కూడా దిగే పరిస్థితి లేదన్నారు. ఆఫ్ఘన్ లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు ఉద్దేశించిన ఎయిరిండియా విమానాన్ని ప్రస్తుతం అక్కడికి పంపజాలమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాబూల్ వెళ్ళవలసిన విమాన సమయాన్ని మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రీ-షెడ్యూల్ చేసినప్పటికీ అక్కడి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్టు ఓ ముఖ్య నోటీసు జారీ అయిందని అంటున్నారు.మరోవైపు కాబూల్ లో గుంపులను అదుపు చేసేందుకు అమెరికా దళాలు గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. తొక్కిడి, దోపిడీల నివారణకు ఇలా కాల్పులు జరిపారని, కమర్షియల్ విమానాల రాకపోకలు లేవు గనుక హడావుడిగా ఈ విమానాశ్రయానికి చేరుకోవద్దని కాబూల్ ఎయిర్ పోర్టు అథారిటీ ప్రకటించింది.
ఇలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఇండియా మధ్య తిరగవలసిన విమానాల రూట్లను కూడా తగిన విధంగా మార్చాలని యోచిస్తున్నారు. షికాగో-న్యూఢిల్లీ, శాన్ ఫ్రాన్సిస్కో =ఢిల్లీ విమానాలను గల్ఫ్ లోని ఓ దేశం వైపు మార్గం మళ్లించవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియా నుంచి అమెరికా వెళ్లే ప్లేన్లను కూడా కొత్త మార్గాల ద్వారా ఆపరేట్ చేయనున్నట్టు సమాచారం.
మరిన్ని ఇక్కడ చూడండి: హిందూ స్త్రీలు ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టే కుంకుమ బొట్టు ప్రాముఖ్యత ఏమిటంటే..