Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో 2500 ఖాళీలు..
Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ నేవీ సెయిలర్ (ఏఏ–ఎస్‌ఎస్‌ఆర్).. ఆగస్టు 2022 బ్యాచ్ కోసం సెయిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి...
Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ నేవీ సెయిలర్ (ఏఏ–ఎస్‌ఎస్‌ఆర్).. ఆగస్టు 2022 బ్యాచ్ కోసం సెయిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరరిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఏఏ(ఆర్టిఫీషర్ అప్రెంటిస్)-500, ఎస్‌ఎస్‌ఆర్(సీనియర్ సెకండరీ రిక్రూట్స్)-2000 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 2002 ఆగస్ట్ 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్నత అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* శిక్షణ సమయంలో నెలకి రూ. 14,600 స్టైపెండ్ అందిస్తారు. అనంతరం శిక్షణ పూర్తయ్యాక లెవల్ 3(డిఫెన్స్ పే) కింద నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు ప్రక్రియ 29-03-2022 మొదలవుతుండగా, 05-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: E Shram Card: ఈ శ్రమ్ కార్డు అప్లై చేశారా.. ఈ బెనిఫిట్స్ అస్సలు కోల్పోకండి..!
Sainik Schools: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..