AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sainik Schools: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..

Sainik Schools approved by Defence Ministry: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్‌ స్కూల్స్‌తోపాటు కొత్తగా 21 పాఠశాలలకు ఆమోదం తెలుపుతూ.

Sainik Schools: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..
Sainik Schools
Shaik Madar Saheb
|

Updated on: Mar 26, 2022 | 10:01 PM

Share

Sainik Schools approved by Defence Ministry: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్‌ స్కూల్స్‌తోపాటు కొత్తగా 21 పాఠశాలలకు ఆమోదం తెలుపుతూ.. రక్షణ శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది నుంచి భాగస్వామ్య (రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రైవేటు, స్వంచ్ఛంద సంస్థలు) పద్ధతిలో ఇవి నడుస్తాయని రక్షణ శాఖ వెల్లడించింది. కొత్తగా వచ్చేవి ప్రస్తుతం ఉన్న సైనిక్‌ స్కూల్స్‌కు భిన్నంగా ఉంటాయంటూ పేర్కొంది. కొత్తగా వచ్చే 21 సైనిక్‌ స్కూల్స్‌లో 7 డే స్కూల్స్‌, 14 పాఠశాలల్లో హాస్టల్‌ వసతి కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఒక్కోటి చొప్పున మంజూర‌య్యాయి. ఏపీలోని క‌డ‌ప జిల్లాకు చెందిన పూజ ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ సైనిక్ స్కూల్‌గా మార‌నుంది. తెలంగాణ క‌రీంన‌గ‌ర్‌కు చెందిన సోష‌ల్ వెల్ఫేర్ స్కూల్‌ను సైనిక్ స్కూల్‌గా సేవలు అందించనుంది.

కాగా దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అదనంగా సైనిక్ స్కూళ్లను మంజూరు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొటున్నాయి. కొత్తగా ఆమోదించిన 21 కొత్త సైనిక్ పాఠశాలల్లో 12 NGOలు, ట్రస్ట్‌లు లేదా సొసైటీల పరిధిలో, 6 ప్రైవేట్ పాఠశాలలు, 3 రాష్ట్ర-ప్రభుత్వ యాజమాన్యంలో ఈ విద్యాసంవత్సరం నుంచే (2022-2023) నడవనున్నాయి.

100 కొత్త సైనిక్ పాఠశాలల ఏర్పాటు లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానానికి (NEP) అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారికి సాయుధ దళాలలో చేరడంతోపాటు మెరుగైన అవకాశాలను అందించడం దీని ఉద్దేశ్యం.

Also Read:

Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం

Gulkand Mousse: గుల్కంద్ పాన్‌తోనే కాదు.. ఇలా కూడా తీసుకోండి.. వేసవిలో చల్లని ఆరోగ్యాన్నిస్తుంది!