PhonePe: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఫోన్‌పేలో ఈ సదుపాయం

PhonePe: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌ లావాదేవీలే జరిగిపోతున్నాయి. ఇన్సురెన్స్‌ చేసుకోవాలంటే వివిధ యాప్స్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే..

PhonePe: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఫోన్‌పేలో ఈ సదుపాయం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2022 | 9:42 PM

PhonePe: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌ లావాదేవీలే జరిగిపోతున్నాయి. ఇన్సురెన్స్‌ చేసుకోవాలంటే వివిధ యాప్స్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఇన్సురెన్స్‌ (Insurance) సంస్థలు వివిధ ఆన్‌లైన్‌ యాప్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఫోన్‌పే కూడా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువస్తోంది. ఇక వినియోగదారుల కోసం మ్యాక్స్‌ లైఫ్‌ స్మార్ట్‌ సెక్యూర్‌ ప్లస్‌ ప్లాన్‌ (Max Life Smart Secure Plus Plan) ను ఫోన్‌ పే (Phone Pe) భాగస్వామ్యంతో మ్యాక్స్‌ లైఫ్ ఇన్సురెన్స్‌ విడుదల చేసింది. ఇది నాన్‌ లిక్డ్‌, నాన్‌ పార్టిసిటింగ్‌ ఇండివిడ్యువల్‌ ప్యూర్‌ రిస్క్‌ ప్రీమియం లైఫ్‌ ఇన్సురెన్స్‌.

ఈ ప్లాన్‌ ఫోన్‌పే వినియోగదారులు వారి కుటుంబం మొత్తానికి ఆర్థిక కవరేజ్‌ను అందించవచ్చు. వార్షిక ప్రారంభ ప్రీమియం రూ.4,426 నుంచి రూ.10 కోట్ల వరకు హమీ మొత్తాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇతర అంశాల కారణంగా ప్రీమియం మొత్తంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఫోన్‌పే ద్వారా బీమాను విక్రయించుకునేందుకు ఐఆర్‌డీఏఐ నుంచి లైసెన్స్‌ పొందింది. ప్రస్తుతం ఉన్న డిజిటల్‌ యుగంలో వినియోగదారులకు జీవిత బీమా కొనుగోళ్లు, క్లెయిమ్‌ పరిష్కార మార్గాలను సులభతరం చేయడంతో పాటు టర్మ్‌ ప్లాన్‌ ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు అందించడమే లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక సదుపాయాలు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇన్సురెన్స్‌, బ్యాంకింగ్‌ లావాదేవీలు తదితర వాటికి బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ కరోనా పుణ్యమా అని అన్ని కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వాలు కూడా ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Jio IPL Plans 2022: ఐపీఎల్ 2022 కోసం రిలయన్స్‌ జియో సరికొత్త ప్లాన్.. రూ.279తో కిక్రెట్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్.!

Credit Debit Card: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!