Credit Debit Card: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!

Credit Debit Card: ఈ రోజుల్లో క్రెడిట్‌, డెబిట్‌కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోయింది. క్రెడిట్‌ కార్డులను కూడా చాలా మందే వాడుతున్నారు. క్రెడిట్‌ కార్డుల వాడకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి...

Credit Debit Card: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2022 | 2:46 PM

Credit Debit Card: ఈ రోజుల్లో క్రెడిట్‌, డెబిట్‌కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోయింది. క్రెడిట్‌ కార్డులను కూడా చాలా మందే వాడుతున్నారు. క్రెడిట్‌ కార్డుల వాడకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వీటి వాడకం ఎంత ఉందో.. సైబర్‌ నేరాలు కూడా అంతే ఉన్నాయి. అమాయకులను ఆసరా చేసుకుని క్రెడిట్‌ కార్డు (Credit Card), డెబిట్ Debit Card) కార్డు వివరాలను తెలుసుకుని అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు. ఎలాంటి మోసాలు జరుగకుండా ఉండేందుకు కార్డులకు సంబంధించిన వివరాలు ఇతరులతో పంచుకోవద్దని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. అయితే క్రెడిట్‌, డెబిట్‌ కార్డును హ్యాక్‌ చేయడానికి కేవలం ఆరు సెకన్ల సమయం సరిపోతుందంటూ ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది.

ఇక ప్రముఖ గ్లోబల్‌ వీపీఎన్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ నార్డ్‌వీపీఎన్‌ అనే కంపెనీ క్రెడట్‌, డెబిట్‌ కార్డుల హ్యాకింగ్‌పై ఒక నివేదిక విడుదల చేసింది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. దీంతో డిజిటల్‌ లావాదేవీలు కూడా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇదే సైబర్‌ నేరస్తులకు వరంగా మారిందని నార్డ్‌ వీపీఎన్‌ తెలిపింది. 140 దేశాల నుంచి 40 లక్షల కార్డు పేమెంట్లను పరిశీలించారు. బ్రూట్‌ ఫోర్స్‌ ద్వారా డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు పేమెంట్లను ఎక్కువగా హ్యాక్‌ చేస్తున్నారని వెల్లడించింది. కొన్ని సెకన్ల వ్యవధిలోని కార్డులో ఉన్న డబ్బులను సులభంగా దోచేస్తున్నారని సూచించింది.

ఇక మనం వాడే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 16 అంకెల యూనిక్‌ నంబర్‌ ఉంటుంది. కార్డుల నెంబర్లను గేస్‌ చేయడానికి అనేక కాంబినేషన్లను ప్రత్యేకమైన కంప్యూటర్‌ సహాయంతో సైబర్‌ నేరస్తులు హ్యాక్‌ చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మోసాలు పెరిగిపోతుండటంతో ఆర్బీఐ ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు చేస్తోంది.

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు జాగ్రత్తలు:

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వాడేవారు ఎప్పటికప్పుడు వారి నెలవారీ స్టెట్‌మెంట్‌లను పరిశీలించాలి. బ్యాంకుల నుంచి వచ్చే సెక్యూరిటీ నోటిఫికేషన్లకు స్పందించాలి. ముఖ్యంగా అకౌంట్లో తక్కువ మొత్తంలో డబ్బులు ఉంచుకోవడం మంచిది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఫోన్‌కాల్స్‌, ఇమెయిల్స్‌ ద్వారా వచ్చే ప్రకననలను నమ్మకూడదు.

ఇవి కూడా చదవండి:

BMW Car: కొత్త కారు కొనుగోలు చేసేవారికి షాకిచ్చిన బీఎండబ్ల్యూ..!

Airtel Payments: రుణ వాయిదాలు ముందస్తు చెల్లింపులు.. ప్రభుత్వానికి ఎయిర్‌టెల్‌ రూ.8,815 కోట్లు చెల్లింపు