Army jobs: పదో తరగతి అర్హతతో భారత తీర రక్షక దళంలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పలు పోస్టుల భర్తీకిన ఓటిఫికేషన్ జారీ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమిస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలను..
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పలు పోస్టుల భర్తీకిన ఓటిఫికేషన్ జారీ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమిస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 255 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో నావిక్ (జనరల్ డ్యూటీ)- 225, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-30 ఖాళీలు ఉన్నాయి.
* నావిక్ జీడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 00+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు నవంబర్ 1, 2001 నుంచి ఆగస్టు 31, 2005 మధ్య జన్మించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనంగా రూ. 21,700 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 06న మొదలవుతుండగా ఫిబ్రవరి 16తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..