Top Ten jobs: ఆ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్.. టాప్ టెన్ జాబ్స్ ఇవే..!
ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, కంపెనీల అవసరాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగావకాశాలు పెరుగుతూ ఉంటాయి. కాలానికి అనుగుణంగా వాటి ప్రాధాన్యతలలో మార్పులు వస్తాయి. సుమారు 20 ఏళ్ల క్రితం డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు ఇప్పుడు అంత ఆదరణ లేకపోవచ్చు. టెక్నాలజీకి అనుగుణంగా నడుచుకున్నప్పుడే యువత ఉద్యోగాలు సాధించగలుగుతారు.
ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, కంపెనీల అవసరాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగావకాశాలు పెరుగుతూ ఉంటాయి. కాలానికి అనుగుణంగా వాటి ప్రాధాన్యతలలో మార్పులు వస్తాయి. సుమారు 20 ఏళ్ల క్రితం డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు ఇప్పుడు అంత ఆదరణ లేకపోవచ్చు. టెక్నాలజీకి అనుగుణంగా నడుచుకున్నప్పుడే యువత ఉద్యోగాలు సాధించగలుగుతారు. ప్రస్తుతం మార్కెట్ రంగం విపరీతంగా విస్తరిస్తోంది. ప్రతి పనిలో కంప్యూటర్ వినియోగం పెరిగింది. వాటిని అనుసంధానంగా ఉన్న ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో ఈ కింద తెలిపిన ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంటుంది.
మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్
మార్కెట్ తీరుతెన్నులు, పోటీ కంపెనీల విషయాలకు సంబంధించిన డేటాను సేకరించి విశ్లేషిస్తారు. చిన్న చిన్న సర్వేలను రూపొందిస్తారు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డేటాను అర్థం చేసుకోవడానికి, వ్యాపారాల కోసం కార్యాచరణ రూపొందించడానికి గణాంక పద్ధతులను ఉపయోగిస్తారు.
ఫైనాన్షియల్ మేనేజర్
ఒక సంస్థకు సంబంధించిన ఆర్థిక విషయాలను పర్యవేక్షించే వారిని ఫైనాన్షియల్ మేనేజర్ అంటారు. బడ్జెట్, అంచనా, పెట్టుబడి ప్రణాళిక, రిస్క్ మేనేజ్‌మెంట్ విధులు నిర్వహిస్తారు. పెరుగుతున్న ఆర్థిక ఒడిదొడుకులు, వ్యాపారాల ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సాయపడతారు.
కంప్యూటర్ మేనేజర్
ప్రతి పరిశ్రమ, సంస్థలోనూ కంప్యూటర్ల వినియోగం తప్పనిసరి అయ్యింది. ఆ విభాగాన్ని పర్యవేక్షించడం కంప్యూటర్ మేనేజర్ల బాధ్యత. కంప్యూటర్ సిస్టమ్‌లు, నెట్‌వర్క్ సజావుగా పనిచేసేలా చూడడం, ఐటీ ప్రాజెక్ట్ నిర్వహణ, సైబర్ భద్రత, ట్రబుల్ షూటింగ్ వీరి ప్రధాన విధులు. ఐటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, డేటాను రక్షించడానికి, కొత్త సాంకేతికతలను అమలు చేయడానికి నైపుణ్యం కలిగిన కంప్యూటర్ మేనేజర్ల అవసరం పెరుగుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవలపర్
టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు డిమాండ్ పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, సిస్టమ్‌లను డిజైన్ చేయడం, కోడ్ చేయడం, పరీక్షించడం, నిర్వహించడం వీరి ముఖ్య లక్ష్యాలు. సాంకేతికతతో నడిచే వ్యాపారాలకు వీరు చాలా అవసరం. కొత్త సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను సృష్టించడం, ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచడం, వినియోగదారు అవసరాలను పరిష్కరించడానికి పని చేస్తారు.
వెబ్ డెవలపర్
ఆకర్షణీయ, సమర్థవంతమైన వెబ్‌సైట్లను రూపొందించడానికి, నిర్వహించడానికి వెబ్ డెవలపర్లు చాలా కీలకం. వీరు వెబ్ సైట్లను తయారు చేసి, నిర్వహిస్తారు. ఫ్రంట్-ఎండ్ (యూజర్ ఇంటర్‌ఫేస్) మరియు బ్యాక్-ఎండ్ (సర్వర్-సైడ్) డెవలప్‌మెంట్ రెండింటిపై దృష్టి సారిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో వీరికి చాలా డిమాండ్ ఉంది.
టెక్నికల్ రైటర్
ప్రస్తుతం సాంకేతికత, ఉత్పత్తులు మరింత అధునాతనమయ్యాయి. వినియోగదారులు వాటిని అర్థం చేసుకోవడానికి, సక్రమంగా ఉపయోగించుకోవడానికి స్పష్టమైన డాక్యుమెంటేషన్ అవసరం. టెక్నికల్ రైటర్లు ఆ పనిని విజయవంతంగా చేస్తారు. స్పష్టమైన, సంక్షిప్త డాక్యుమెంటేషన్‌ను రూపొందిస్తారు.
పారా లీగల్ అసిస్టెంట్
కేసు ఫైల్స్ ను సిద్ధ చేయడం, క్లయింట్లతో కమ్యూనికేషన్ నిర్వహించడం, చట్టపరమైన పరిశోధనలు, పత్రాలను రూపొందించడంలో న్యాయవాదులకు వీరు ఎంతో సహాయంగా ఉంటారు. కేసు తయారీ, కోర్టులో దాఖలుతో సహా వివిధ పనులలో న్యాయ బృందానికి మద్దతు ఇస్తారు.
గణాంకవేత్త
వ్యాపార వ్యూహాలు, విధానాల రూపకల్పన, శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన గణాంకాలను రూపొందించడంలో వీరి పాత్ర కీలకం. మార్కెట్ లో ట్రెండ్‌లను విశ్లేషించడానికి, పరిశ్రమల కోసం అంచనాలను రూపొందించడానికి గణాంక పద్ధతులను ఉపయోగిస్తారు. వివిధ పరిశ్రమలు, సంస్థలలో వీరి ప్రాధాన్యం పెరుగుతోంది.
మెడికల్ అసిస్టెంట్
అపాయిట్ మెంట్లను షెడ్యూల్ చేయడం, రోగి చరిత్రను తెలుసుకోవడం, ప్రాథమిక వైద్య విధానాలను నిర్వహించడం వీరి పనులు. ఆరోగ్య సంరక్షణ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో వీరికి డిమాండ్ పెరుగుతోంది.
డేటా సైంటిస్ట్
వ్యాపారానికి సంబంధించిన వ్యూహాలు, పోకడలను అర్థం చేసుకోవటానికి డేటా సైంటిస్ట్ సాయం చేస్తారు. వివిధ గణాంక పద్ధతులు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు, డేటా విజువలైజేషన్ ద్వారా విశ్లేషిస్తారు. కొత్త నిర్ణయాలు, ఆవిష్కరణల సమయంలో వివిధ సంస్థలు ఈ డేటాపై ఆధారపడతాయి. వీరికి డిమాండ్ క్రమీణా పెరుగుతోంది.