AP TET 2024 Halltickets: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల.. వెబ్‌సైట్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఆదివారం (సెప్టెంబర్‌ 22) విడుదలయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది నిర్వహించనున్న టెట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆయా పరీక్ష కేంద్రాల్లో..

AP TET 2024 Halltickets: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల.. వెబ్‌సైట్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
AP TET 2024 Halltickets:
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 22, 2024 | 6:26 AM

అమరావతి, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఆదివారం (సెప్టెంబర్‌ 22) విడుదలయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది నిర్వహించనున్న టెట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆయా పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో వీటిని నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్‌ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లను పొందొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ 2024 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక అక్టోబర్‌ 4 నుంచి (పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత) ప్రాథమిక ‘కీ’లు వరుసగా వెబ్‌సైట్లో విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 27న తుది ‘కీ’ విడుదల చేస్తారు. నవంబర్‌ 2న ఫలితాలను ప్రకటిస్తారు. ఇక ఇప్పటికే వెబ్‌సైట్లో మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఓపెన్‌ అయ్యింది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ మాక్‌ టెస్ట్‌లను ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను వినియోగించుకోవడానికి సదుపాయం కల్పించారు. ఈ మాక్‌ టెస్ట్‌లు రాయడం ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే టెట్‌ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓసీ(జనరల్‌) కేటగిరీకి చెందిన అభ్యర్ధులకు 60 శాతం మార్కులు ఆపైన‌ వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఇక బీసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులకుపైన‌, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు 40 శాతం మార్కులకుపైన‌ మార్కులు వస్తే ఉత్తీర్ణత అయినట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి

టెట్‌ పరీక్ష విధానం ఇలా..

టెట్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలకు జరుగుతుంది. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. శిశువికాసం, అధ్యాపన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌ 1 నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌ 2 నుంచి 30 ప్రశ్నలు, మెయిన్‌ సబ్జెక్ట్‌ నుంచి 60 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. అన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలే అడుగుతారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..