ILBS Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే..

ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

ILBS Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే..
Ilbs Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2022 | 8:39 AM

ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిపికేషన్‌లో భాగంగా మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌, జూనియర్‌ ఎగ్జి్క్యూటివ్‌, మేనేజర్‌, ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌ వంటి పోస్టులున్నాయి.

ఇవి కూడా చదవండి

* హెపటాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, నెఫ్రాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, ఎపిడమాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఎంబీబీఎస్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ డీఎం/ ఎండీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 15-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..