IIT Tirupati Recruitment: ఐఐటీ తిరుపతిలో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
IIT Tirupati Recruitment: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా..
IIT Tirupati Recruitment: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఖాళీలగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఫస్ట్‌క్లాస్ పీహెచ్‌డీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు కనీసం మూడేళ్ల ఇండస్ట్రియల్/టీచింగ్/రీసెర్చ్ అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 38ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500లతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్ క్వాలిఫికేషన్, పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 24-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Smart Phones: ఈ వారం ఇండియాలో విడుదలయ్యే ఫోన్‌లు, వాటి ధర.. ఫీచర్స్ తెలుసుకోండి..