Smart Phones: ఈ వారం ఇండియాలో విడుదలయ్యే ఫోన్‌లు, వాటి ధర.. ఫీచర్స్‌ తెలుసుకోండి..

Smart Phones: ఈ వారం ఇండియాలో కొన్ని కొత్త మొబైల్‌ ఫోన్స్‌ విడుదలకానున్నాయి. అక్టోబర్ తర్వాత, iQOO Z5, Xiaomi 11 Lite NE 5G, Motorola Edge 20 Pro, Samsung

Smart Phones: ఈ వారం ఇండియాలో విడుదలయ్యే ఫోన్‌లు, వాటి ధర.. ఫీచర్స్‌ తెలుసుకోండి..
Upcoming Phone
Follow us

|

Updated on: Nov 28, 2021 | 9:44 PM

Smart Phones: ఈ వారం ఇండియాలో కొన్ని కొత్త మొబైల్‌ ఫోన్స్‌ విడుదలకానున్నాయి. అక్టోబర్ తర్వాత, iQOO Z5, Xiaomi 11 Lite NE 5G, Motorola Edge 20 Pro, Samsung Galaxy M52 5G వంటి అనేక మిడ్‌రేంజ్ ఫోన్‌లను విడుదల అయ్యాయి. అయితే నవంబర్ చివరి వారంలో రెండు ఫోన్‌లు మాత్రమే లాంచ్‌ కానున్నాయి.ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు భారతదేశంలోకి వస్తున్నాయి. వాటిలో ఒకటి జనాదరణ పొందిన రెడ్‌మి నోట్ 11 సిరీస్‌కు సంబంధించినది. మరొకటి మోటరోలా పాపులర్ మోటో జి మోడల్‌తో సరసమైన ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

Redmi Note 11T Redmi Note 11T 2021 అనేది సరసమైన స్మార్ట్‌ఫోన్. నవంబర్ 30 న లాంచ్ కాబోతుంది. Redmi Note 11T ఒక Mediatek డైమెన్సిటీ 810 చిప్, 90Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, IPS LCD డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్, స్టీరియో స్పీకర్లతో 5000mAh బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు. ఫోన్ ధరలకు సంబంధించి ఎలాంటి లీక్ లేదా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. కానీ Redmi Note 10T ధరనే అదే కలిగి ఉంటుందని అందరు నమ్ముతున్నారు. అంటే బేస్ వేరియంట్ ధర సుమారు రూ.14,000 అని చెప్పవచ్చు.

Moto G31 Motorola Moto G31ని యూరప్‌లో లాంచ్ చేసిన కొద్దిసేపటికే భారత్‌కు తీసుకువస్తోంది. Moto G31 ఈ సంవత్సరం కొత్త ఎంట్రీ-లెవల్ Moto G మోడల్ అని అంటున్నారు. Moto G31 MediaTek Helio G85 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తుండగా ఇది 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Motorola Redmi Note 11T మాదిరిగానే 50MP ప్రధాన బ్యాక్‌ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 10W ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే ఉపయోగించారు.

Vastu Tips: లక్ష్మీదేవి నిలవాలంటే ఈ వాస్తు తప్పులు అస్సలు చేయకండి.. చాలా కోల్పోతారు..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలు..

ఆకాశం నీలి రంగులో ఉంటుంది.. సాయంత్రం ఆరెంజ్‌ కలర్‌లో కనిపిస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?