- Telugu News Photo Gallery Technology photos These 4 smartphones come with a 6000mAh battery the price is just Rs.7299 only
Mobile Phones: ఈ 4 ఫోన్‌లు 6000mAh బ్యాటరీతో వస్తాయి.. ధర కేవలం రూ. 7299 మాత్రమే..
Mobile Phones: భారతీయ మొబైల్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి భిన్నమైన ధరలు, ఫీచర్‌లతో వస్తున్నాయి. చాలామంది డిస్ప్లే, కెమెరా, డిజైన్‌పై దృష్టి పెడుతారు
Updated on: Nov 29, 2021 | 7:10 PM

భారతీయ మొబైల్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి భిన్నమైన ధరలు, ఫీచర్‌లతో వస్తున్నాయి. చాలామంది డిస్ప్లే, కెమెరా, డిజైన్‌పై దృష్టి పెడుతారు కానీ బ్యాటరీ సామర్థ్యాన్ని తెలుసుకోరు. దీని కారణంగా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. బలమైన బ్యాటరీతో వస్తున్న 4 ఫోన్ల గురించి తెలుసుకుందాం.

Redmi 9 పవర్ 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.11,499. అలాగే ఈ మొబైల్ 6000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో కెమెరా 48 మెగాపిక్సెల్‌లు. ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

SAMSUNG Galaxy F12 మొబైల్ రూ.11499, 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది 512 GB SD కార్డ్‌ని సపోట్ చేస్తుంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో కెమెరా 48 మెగాపిక్సెల్‌లు. ఈ ఫోన్ Exynos 850 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Infinix Hot 10 Playని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.8299కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇందులో 6.82 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది దీనిలో కెమెరా 13 మెగాపిక్సెల్‌లు, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్‌లు.

Gionee Max Pro స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో వచ్చే చౌకైన స్మార్ట్‌ఫోన్. ఈ మొబైల్ 6.52 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720x1560 పిక్సెల్‌లు. అలాగే వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందిస్తున్నారు. దీనిలో కెమెరా 13 మెగాపిక్సెల్‌లు. ఇది 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 3 GB RAM, 32 GB స్టోరేజ్‌తో వస్తుంది.



