IIT Goa Recruitment: గోవా ఐఐటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. రూ. 70 వేలకుపైగా జీతం పొందే అవకాశం.

IIT Goa Recruitment 2021: గోవాలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 17 నాన్‌ టీచింగ్‌ పోస్టులను...

IIT Goa Recruitment: గోవా ఐఐటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. రూ. 70 వేలకుపైగా జీతం పొందే అవకాశం.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 05, 2021 | 8:55 AM

IIT Goa Recruitment 2021: గోవాలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 17 నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 17 ఖాళీలకు గాను డిప్యూటీ రిజిస్ట్రార్‌–02, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–03, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌–01, సీనియర్‌ సూపరింటెండెంట్‌–03, జూనియర్‌ సూపరింటెండెంట్‌–02, జూనియర్‌ అసిస్టెంట్‌–03,అసిస్టెంట్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌–01,జూనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ సూపరింటెండెంట్‌–02 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు, సంబంధిత పని అనుభవం ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టును అనుసరించి 27 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.78,800 వరకు జీతం చెల్లిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 26.09.2021 చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read: Railway Jobs: టెన్త్‌ పాసైన వారికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు..!

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో నేడు జాబ్‌మేళా.. టెక్‌మహీంద్ర, విప్రో వంటి టాప్‌ కంపెనీలు హాజరు.