Railway Jobs: టెన్త్ పాసైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు..!
Railway Jobs: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్..
Railway Jobs: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఇక తాజాగా రైల్వేలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్.. అటెండర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాతపరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు సంబంధించి తుది ఎంపిక జరుగుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు రైల్వే అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా చాలా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.5200 నుంచి రూ.20,200 వరకు చెల్లిస్తారు.
వయసు: 28ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 15, 2021
కాగా, ఇప్పటికే రైల్వే శాఖలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. పదో తరగతి అర్హతతోనే చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంటాయి.