AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌ మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షలకుపైగా జీతం పొందే అవకాశం.

AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు...

AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌ మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. రూ. 2 లక్షలకుపైగా జీతం పొందే అవకాశం.
Aiims Mangalagiri
Narender Vaitla
|

Updated on: Sep 05, 2021 | 2:02 PM

Share

AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌, లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలకు గాను ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌(కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌)–01, లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌),కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌–05 ఖాళీలను భర్తీ చేయనుంది. * ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌(కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు నర్సింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు. * లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌(అసిస్టెంట్‌ ప్రొఫసర్‌), కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 50ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * లెక్చరర్‌ ఇన్‌ నర్సింగ్‌(అసిస్టెంట్‌ ప్రొఫసర్‌), కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 నుంచి 2,08,700 జీతంగా చెల్లిస్తారు. * ప్రొఫెసర్‌ కమ్‌ ప్రిన్సిపల్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,23,100 నుంచి 2,15,900 వరకూ చెల్లిస్తారు. * అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 14-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IIT Goa Recruitment: గోవా ఐఐటీలో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. రూ. 70 వేలకుపైగా జీతం పొందే అవకాశం.

Railway Jobs: టెన్త్‌ పాసైన వారికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు..!

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు