ICAI CA 2025 Toppers: సీఏ ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్ అమ్మాయి సత్తా.. ఏకంగా ఆల్ ఇండియా టాప్ ర్యాంక్!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జనవరి 2025 చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సు ఫలితాలను ప్రకటించింది. పరీక్ష రాసిన విద్యార్ధులు ICAI CA ఫౌండేషన్, ఇంటర్ ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో హైదరాబాద్ అమ్మాయి ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది..

హైదరాబాద్, మార్చి 4: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఇంటర్, ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం (మార్చి 4) విడుదలయ్యాయి. జనవరిలో ఈ పరీక్షలు నిర్వహించగా.. వీటి ఫలితాలను ICAI ఈ రోజు విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లో తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వంటి వివరాలను ఎంటర్ చేసి స్కోరు కార్డులు, మెరిట్ జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తాజాగా విడుదలైన సీఏ ఇంటర్ 2025 పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షి అగర్వాల్ 86.63 శాతం మార్కులతో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించింది. మొత్తం 600 మార్కులకు గానూ 521 మార్కులు సాధించింది. విజయవాడకు చెందిన తోట సోమనాధ్ శేషాద్రి నాయుడు 516 మార్కులతో 86 శాతం స్కోరు చేసి రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌కి చెందిన సర్థాక్ అగర్వాల్ 515 మార్కులతో 85.83 శాతం స్కోర్ చేసి మూడో ర్యాంక్‌లో నిలిచాడు.
సీఏ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రెండు గ్రూపులకు (Group 1, 2) సంబంధించి మొత్తం 48,261 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. 6781 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగలిగారు. అంటే 14.05 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం సీఏ ఇంటర్ గ్రూప్ 1 పరీక్షల్లో 1,08,187 మంది పరీక్ష రాయగా 15,332 మంది (14.175 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక గ్రూప్ 2 పరీక్షలో 80,368 మంది పరీక్ష రాయగా.. 17, 813 మంది (22.16 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫౌండేషన్ పరీక్షలో 21.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా సీఏ ఇంటర్మీడియట్ గ్రూపు 1 పరీక్షలు జనవరి 11, 13, 15 తేదీల్లో నిర్వహించగా.. గ్రూపు 2 పరీక్షలు జనవరి 17, 19, 21 తేదీల్లో జరిగాయి. రెండు గ్రూప్‌ల వారికి జనవరి 12, 14, 16, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




