Sugarcane Juice: ఎండల్లో చల్లగా చెరకు రసం తాగుతున్నారా? ముందీ విషయం తెలుసుకోండి..
సాధారణంగా మండే ఎండల్లో చల్లని పానీయాలు తాగాలని అనిపిస్తుంది. చాలా మంది చెరకు రసం తాగేందుకు ఇష్టపడతారు. చెరకు రసం తాగిన తర్వాత మజాగా అనిపిస్తుంది. కానీ ఇలా తరచూ చెరకు రసం తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెరకు రసం శరీరానికి అంత ఆరోగ్యకరమైనది కాదని ICMR కూడా చెబుతోంది..

శీతాకాలం ముగిసిపోయింది. ప్రకృతిలో వేసవి వేడి క్రమంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దాహం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో చల్లని పానీయం తాగాలని అనిపిస్తుంది. చాలా మంది చెరకు రసం తాగేందుకు ఇష్టపడతారు. చెరకు రసం తాగిన తర్వాత మజాగా అనిపిస్తుంది. కానీ ఇలా తరచూ చెరకు రసం తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెరకు రసం శరీరానికి అంత ఆరోగ్యకరమైనది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా చెబుతోంది.100 మి.లీ చెరకు రసంలో దాదాపు 13-15 గ్రాముల చక్కెర ఉంటుందని పరిశోధనలో తేలింది. పెద్దలు రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను, 7-10 సంవత్సరాల వయస్సు గల టీనేజర్లు 24 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అయితే, మండే ఎండల్లో చెరకు రసం తాగకూడదని మాత్రం IMCR చెప్పడం లేదు.
ఏదీ అతిగా తీసుకోవడం మంచిది కాదు. చెరకు రసం తాగడం వల్ల కొంత నష్టం ఉన్నప్పటికీ, దానిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చెరకు రసంలో పోషక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో చెరకు రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అదనంగా, చెరకు రసంలోని ఖనిజాలు దంతాలు, ఎముకలను బలపరుస్తాయి.
చెరకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు..
- జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
- మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.
- దంతాలు, ఎముకలను బలపరుస్తుంది.
- హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- రక్తపోటును స్థిరీకరిస్తుంది.
- అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- స్ట్రోక్ అవకాశాన్ని తగ్గిస్తుంది.
- వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








