HPCL Recruitment: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఇంకా రెండు రోజులే..
HPCL Recruitment: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL Recruitment) పలు పోస్టుల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు..
HPCL Recruitment: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL Recruitment) పలు పోస్టుల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్ మెరిట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 స్టైపెండ్ చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: BJP Politics: రహస్య సమావేశాలతో హడావిడి చేసిన నేతలతో.. రాష్ట్ర పార్టీ చీఫ్ సంధి చర్చలు
మానవ హృదయ కణాలతో కృత్రిమ చేప !! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి !! వీడియో