NMDC Hyderabad 2022: యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా.. ఎన్‌ఎమ్‌డీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..
భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Junior Officer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
NMDC Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Junior Officer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 22
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ వర్తిస్తుంది.
పే స్కేల్: నెలకు రూ.50,000లు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే యూజీసీ నెట్ డిసెంబర్ 2022, జూన్ 2021లో అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: యూజీసీ నెట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.500
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 17, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: