AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HPCL Jobs 2025: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఈ అర్హతలు ఉంటే సరి

హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) యేటా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనుంది..

HPCL Jobs 2025: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఈ అర్హతలు ఉంటే సరి
HPCL Jobs
Srilakshmi C
|

Updated on: Apr 06, 2025 | 3:05 PM

Share

హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 63 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇలా..

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 11
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 17
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో పోస్టుల సంఖ్య: 6
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – కెమికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 1
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైర్ & సేఫ్టీ విభాగంలో పోస్టుల సంఖ్య: 28

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ అండ్‌ సేఫ్టీ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో తప్పనిసరిగా 3 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్‌సీ వారికి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు 15 ఏళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 30, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద రూ.1180 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్/టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిక నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
యూరిన్ బ్యాగ్ పట్టుకుని రిక్షా తొక్కుతున్న వృద్ధుడు..చూస్తే
యూరిన్ బ్యాగ్ పట్టుకుని రిక్షా తొక్కుతున్న వృద్ధుడు..చూస్తే
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్