HURL Recruitment: హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. నేడే చివరి తేదీ.
HURL Recruitment 2021: హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యూఆర్‌ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, సీఐఎల్, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థల అనుబంధ...
HURL Recruitment 2021: హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యూఆర్‌ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, సీఐఎల్, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థల అనుబంధ సంస్థ అయిన హెచ్‌యూఆర్‌ఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో (ఆగస్టు 16) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 513 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * వీటిలో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. * కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 25 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. * పోస్టులకు ఎంపికైన ఫ్రెషర్స్ అభ్యర్థులకు ఏడాదికి రూ.3 లక్షలు, అనుభవం ఆధారంగా గరిష్టంగా ఏడాదికి రూ.5.8 లక్షలు చెల్లిస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు నేడే (ఆగస్టు 16) చివరి తేదీ. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
AP schools Re-opening: ఏపీలో నేటినుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తల్లిదండ్రుల అనుమతితోనే..