Ajay Gupta: కాళ్లు లేకపోయినా కలను సాధించాడు.. 1100 స్కూల్స్ పెట్టిన గ్రెటెస్ట్ పర్సన్ ఎవరంటే..?

మన సమాజంలో దివ్యాంగులంటే ఓ చిన్నచూపు ఉంటుంది. ప్రతి పనికి వారు వేరే వారిపై ఆధారపడడంతో వారిపై చాలా మంది జాలిపడతారు. అయితే వీరిలో కొంత మంది మాత్రం తమ ప్రత్యేకతను చాటుకుంటూ నలుగురిలో పేరును సంపాదించుకుంటారు. బచ్‌పన్ స్కూల్స్ అధినేత అజయ్ గుప్తా ఇలాంటి కోవకు చెందిన వారే. తొమ్మిది నెలల వయసులో పోలియో సోకడంతో అతని కాళ్లు నడుము కింది భాగంలో పనికిరాకుండా పోయాయి.

Ajay Gupta: కాళ్లు లేకపోయినా కలను సాధించాడు.. 1100 స్కూల్స్ పెట్టిన గ్రెటెస్ట్ పర్సన్ ఎవరంటే..?
Ajay Gupta Bachpan School
Follow us

|

Updated on: Aug 04, 2024 | 6:45 PM

మన సమాజంలో దివ్యాంగులంటే ఓ చిన్నచూపు ఉంటుంది. ప్రతి పనికి వారు వేరే వారిపై ఆధారపడడంతో వారిపై చాలా మంది జాలిపడతారు. అయితే వీరిలో కొంత మంది మాత్రం తమ ప్రత్యేకతను చాటుకుంటూ నలుగురిలో పేరును సంపాదించుకుంటారు. బచ్‌పన్ స్కూల్స్ అధినేత అజయ్ గుప్తా ఇలాంటి కోవకు చెందిన వారే. తొమ్మిది నెలల వయసులో పోలియో సోకడంతో అతని కాళ్లు నడుము కింది భాగంలో పనికిరాకుండా పోయాయి. చికిత్స కోసం అతని కుటుంబం ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కాలంలో వైద్యపరమైన పరిష్కారాలు పరిమితంగానే ఉండడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. అయితే అతడు అంతటితో ఆగపోకుండా  దేశవ్యాప్తంగా 1,100 పైగా ‘బచ్‌పన్’ పాఠశాలల స్థాపించి అందరికీ ఆదర్శంగా మారాడు. ఈ నేపథ్యంలో బచ్‌పన్ స్కూల్స్ అధినేత అజయ్ గుప్తా సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తా తాతగారి స్వీట్ షాప్‌కు వచ్చినప్పుడు అజయ్ పరిస్థితి గురించి తెలుసుకుని శారీరక వైఫల్యం చదువుకు అడ్డుకాదని గుప్తాకు అవగాహన కల్పించారు. విద్యతోనే అతడి జీవితం మారుతుందని కుటుంబ సభ్యులను ఒప్పించి పాఠశాలలో చేర్పించారు. కుటుంబ సభ్యులు గుప్తాను ప్రోత్సహించాలని నిర్ణయించుకుని గుప్తాను భుజాలపై మోసుకుని స్కూల్‌కు తీసుకెళ్లేవారు. మూడవ తరగతిలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన గుప్తా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన చదువును కొనసాగించాడు. తదనంతరం అతను వీల్ చైర్‌లో పాఠశాల, కళాశాలకు వెళ్లి చదువును ముగించించాడు. 

అయితే మొదటి నుంచి వ్యాపార రంగంపై మక్కువ పెంచుకున్న గుప్తా హార్డ్‌వేర్ వ్యాపారం చేశారు. అయితే అది విజయవంతం కాకపోవడంతో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభించాడు. చాలా నగరాల్లో విస్తరించి ఉన్న బ్రాంచ్‌లతో విజయవంతమైన కంప్యూటర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాడు. అయితే ప్రభుత్వ కళాశాలలు కంప్యూటర్ విద్యను అందించడం ప్రారంభించినప్పుడు వ్యాపారానికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే గుప్తా తన కుమార్తె కోసం తగిన ప్లే స్కూల్ కోసం వెతుకుతున్నప్పుడు మంచి స్కూల్స్ లేవని గ్రహించి ‘బచ్‌పన్’ ప్రారంభించాడు.  గుప్తా 2004లో ‘ఎస్‌కే ఎడ్యుకేషన్స్’ని స్థాపించి, ‘బచ్‌పన్’ స్కూల్ చెయిన్‌కు పునాది వేశారు. ప్రస్తుతం 1,100 పైగా ‘బచ్‌పన్’ ప్లే స్కూల్ ఫ్రాంచైజీలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి, వేలాది మంది పిల్లలకు సేవలు అందిస్తోంది. గుప్తా 2009లో అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్, 2015లో రిషిహుడ్ యూనివర్శిటీను కూగా స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నాడు. కాళ్లు లేని గుప్తా ఎందరో విద్యార్థులు తమ కాళ్లపై నిలబడేందుకు సహకారం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి