Samsung: 9 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 900 కి.మీలు వెళ్లొచ్చు.. సామ్‌సంగ్ నుంచి మరో అద్భుతం
ప్రభుత్వాలు సైతం ఈ వెహికిల్స్‌కు ప్రోత్సాహం అందించడం. పెరుగుతోన్న ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించడం కారణంగా చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం అందుబాటులోకి రాలేవని చెప్పాలి....
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా ఆదరణ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వెహికిల్స్ తయారీతో పాటు వినియోగం సైతం భారీగా పెరిగింది. ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలన్నీ ఈవీ సెగ్మెంట్స్‌లోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని దిగ్గజ సంస్థలు ఈ వెహికిల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
ప్రభుత్వాలు సైతం ఈ వెహికిల్స్‌కు ప్రోత్సాహం అందించడం. పెరుగుతోన్న ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించడం కారణంగా చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం అందుబాటులోకి రాలేవని చెప్పాలి. పెట్రోల్ బంకులతో పోల్చితే ఈవీ స్టేషన్స్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈవీ స్టేషన్స్ ఏర్పాటు పెరుగుతోంది.
దీంతో ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయణించే వారికి ఛార్జింగ్ ఎప్పుడు అయిపోతుందోన్న భయం ఉంటుంది. అలాగే బ్యాటరీ ఛార్జ్ కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుండంతో ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీటర్లు ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీ భిన్న రూపాల్లో లభించనుంది. అంటే కార్లు, బైక్స్, ట్రక్స్, బస్సు.. ఇలా ఏ వాహనంలో అయినా ఉపయోగించుకునేలా సామ్‌సంగ్ ఈ బ్యాటరీని రూపొందిస్తుంది. సామ్‌సంగ్‌లోని బ్యాటరీ విభాగమైన సామ్‌సంగ్ ఎస్‌డీఐ దీన్ని రూపొందించింది.
ఇక ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావడం విశేషం. ఈ బ్యాటరీ ఏకంగా 20 ఏళ్లపాటు పనిచేస్తుందని కంపెనీ చెబతోంది. ఇప్పటికే ఈ బ్యాటరీకి సంబంధించి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని కంపెనీలకు చెందిన వాహనల్లో బ్యాటరీలను అమర్చి విస్తృత స్థాయిలో పరీక్షిస్తున్నారు. పరీక్షలన్నీ పూర్తి అయిన తర్వాత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ చెబతోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..