iphone 14: ఐఫోన్14పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ. 24 వేల వరకు..
టెక్ మార్కెట్లో యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ అంటే ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఐ ఫోన్‌కు సంబంధించి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు టెక్ ప్రియులు...
టెక్ మార్కెట్లో యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ అంటే ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఐ ఫోన్‌కు సంబంధించి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు టెక్ ప్రియులు ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఐఫోన్ నుంచి కొత్త సిరీస్ 16 వస్తోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాత మోడల్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 24 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ. 79,600గా ఉంది.
అయితే ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 56,000కే అందుబాటులో ఉంది. అంటే ఏకంగా రూ. 23 వేల డిస్కౌంట్ లభిస్తోందన్నమాట. అయితే ఈ డిస్కౌంట్ ఇక్కడితో ఆగిపోలేదు. ఎంపిక చేసిన పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 55,499కే సొంతం చేసుకోవచ్చు. సుమారు రూ. 24 వేలకి పైగా డిస్కౌంట్ లభిస్తుండడం విశేషం. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 48,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఇక ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం ఇంఉదలో సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించారు. అలాగే ఈ ఫోన్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇందులో బిల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్‌ను అందించారు. ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి…