AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2024 Cutoff Ranks: నీట్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో చెక్‌ చేసుకోండి

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024లో అర్హత సాధించిన విద్యార్థుల ర్యాంకులు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటగిరీ వైజ్‌ కటాఫ్‌ మార్కులు కూడా ప్రకటించారు. మొత్తం 720 మార్కులకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అన్‌ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు162 మార్కులుగా నిర్ణయించారు. ఏపీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161 నుంచి 127 మార్కులు కటాఫ్‌గా ప్రకటించారు. ఆ లెక్కగన దాదాపు 43,788 మంది ర్యాంకులు..

NEET UG 2024 Cutoff Ranks: నీట్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో చెక్‌ చేసుకోండి
NEET UG cutoff
Srilakshmi C
|

Updated on: Aug 14, 2024 | 11:22 AM

Share

అమరావతి, ఆగస్టు 4: తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024లో అర్హత సాధించిన విద్యార్థుల ర్యాంకులు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటగిరీ వైజ్‌ కటాఫ్‌ మార్కులు కూడా ప్రకటించారు. మొత్తం 720 మార్కులకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అన్‌ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు162 మార్కులుగా నిర్ణయించారు. ఏపీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161 నుంచి 127 మార్కులు కటాఫ్‌గా ప్రకటించారు. ఆ లెక్కగన దాదాపు 43,788 మంది ర్యాంకులు పొందారు. ఇక తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127 మార్కులు, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. మొత్తం 49,143 మందికి ర్యాంకులు వచ్చాయి. అయితే వచ్చిన ర్యాంకు ఆధారాంగా ఆయా రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ఏయే కాలేజీల్లో సీటు వస్తుందో తెలియక అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించగా.. కౌన్సెలింగ్‌ టైంలో ఏ ర్యాంకుకు ఏ కాలేజీల్లో సీట్లు వచ్చాయో తెలుపుతూ ఆయా యూనివర్సిటీలు గతేడాది ప్రవేశాల వివరాలను వెల్లడించాయి.

తద్వారా అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో పాటు ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో సరి పోల్చుకుని ఈసారి తమకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకు వివ‌రాలు ఇక్కడ తెలుసుకోండి. కాగా ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్‌ యూజీ 2024 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. నీట్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23.33లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

గతేడాది (2023-24) డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ప్రవేశాల తీరిది

  • బీసీ ఏ కోటాలో 501 మార్కులతో చివరి ర్యాంకు 107183 వరకు సీట్లు పొందారు
  • బీసీ బీ కోటాలో 500 మార్కులతో చివరి ర్యాంకు 108454 వరకు సీట్లు పొందారు
  • బీసీ సీ కోటాలో 454 మార్కులతో చివరి ర్యాంకు 158282 వరకు సీట్లు పొందారు
  • బీసీ డీ కోటాలో 497 మార్కులతో చివరి ర్యాంకు 111696 వరకు సీట్లు పొందారు
  • బీసీ ఈ కోటాలో 458 మార్కులతో చివరి ర్యాంకు 1535.9 వరకు సీట్లు పొందారు
  • ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 550 మార్కులతో చివరి ర్యాంకు 63967 వరకు సీట్లు పొందారు
  • ఓసీ కోటాలో 543  మార్కులతో చివరి ర్యాంకు 69941 వరకు సీట్లు పొందారు
  • ఎస్సీ కోటాలో 451 మార్కులతో చివరి ర్యాంకు 161655 వరకు సీట్లు పొందారు
  • ఎస్టీ కోటాలో 413 మార్కులతో చివరి ర్యాంకు 211061 వరకు సీట్లు పొందారు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.