Govt Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే?
రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల కోసం 69 ఖాళీలతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు..
Railtelindia: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల కోసం 69 ఖాళీలతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు Railtelindia.com లో దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. RailTel రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2022 ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 150 మార్కుల మల్లిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం:
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి 50 మార్కులతో నిర్వహించే ఇంటర్వ్యూ కోసం పిలవనున్నారు. ఉద్యోగానికి ఎంపిక కావాలంటే అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుముగా రూ.1200 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి.
ఈ పత్రాలు అవసరం:
అభ్యర్థులు విద్యార్హత, సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం [SC/ST/OBC (NCL)/EWS], ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్, వైకల్య ధృవీకరణ పత్రం, మాజీ సైనికులు, ఇతరుల విషయంలో డిశ్చార్జ్ సర్టిఫికేట్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేయండి: అధికారిక వెబ్‌సైట్ railtelindia.comకి వెళ్లండి.
హోమ్‌పేజీలో ‘కెరీర్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. ‘ప్రస్తుత ఉద్యోగ అవకాశాలు’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
RailTel కార్పొరేషన్ టెక్నికల్/మార్కెటింగ్/ఫైనాన్స్/లీగల్ విభాగాల్లో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ (SC/ST/OBC బ్యాక్‌లాగ్ ఖాళీలతో సహా) ట్యాబ్ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతోంది. అందులో అడిగిన వివరాలను పూర్తి చేసి నమోదు చేసుకోవాలి.
అనంతరం RailTel రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ వివరాలను పూరించి, నిర్ణీత ఫార్మాట్‌లో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకొని ఉంచుకోవాలి.
Also Read: C-DAC Recruitment: బీటెక్ చేసిన వారికి సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ..