IICB Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌కుపైగా జీతం..

IICB Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (IICB) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీచేసింది. కోల్‌క‌తాలో ఉన్న ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో..

IICB Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌కుపైగా జీతం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 17, 2022 | 4:22 PM

IICB Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (IICB) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీచేసింది. కోల్‌క‌తాలో ఉన్న ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివ‌రాలు మీ కోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 09 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో సైంటిస్ట్ (03), సీనియ‌ర్ సైటింస్టులు (06) ఖాళీలు ఉన్నాయి.

* సైంటిస్ట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, కెమికల్‌/ బయలాజికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధి రీసెర్చ్‌లో అనుభ‌వం త‌ప్పనిస‌రి. అభ్య‌ర్థుల వ‌య‌సు 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

* సీనియ‌ర్ సైంటిస్ట్‌ పోస్టుల‌కు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పరిశోధన అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 37 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* సైంటిస్ట్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ. 1,16,398, సీనియ‌ర్ సైంటిస్ట్ పోస్టుల‌కు నెల‌కు రూ. 1,33,936 జీతంగా చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను తొలుత అనుభ‌వం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ఎగ్జామినేషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తు ఫీజుగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: ఈ అలవాట్లు పాటిస్తే వ్యాయామంతో పనే ఉండదు..! సమయం, డబ్బు రెండు ఆదా..?

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. పౌర్ణమి శ్రీవారి గరుడసేవ రద్దు..

AP News: పండుగపూట యువకుల ప్రాణం తీసిన సరదా.. కాల్వలో ఈత కొట్టేందుకు దిగి..