ఈ అలవాట్లు పాటిస్తే వ్యాయామంతో పనే ఉండదు..! సమయం, డబ్బు రెండు ఆదా..?

Health News: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం కచ్చితంగా అవసరం. అప్పుడే శరీరం ఫిట్‌గా ఉంటుంది. కానీ మీకు సమయం

ఈ అలవాట్లు పాటిస్తే వ్యాయామంతో పనే ఉండదు..! సమయం, డబ్బు రెండు ఆదా..?
Health News
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Jan 18, 2022 | 1:30 PM

Health News: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం కచ్చితంగా అవసరం. అప్పుడే శరీరం ఫిట్‌గా ఉంటుంది. కానీ మీకు సమయం, శక్తి రెండు ఉండాలి. అయితే వ్యాయామం చేయకుండా కూడా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. దీనికి జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ ఒక్క రోజులో మీరు తేడాను చూడలేరు వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా తేడా గమనిస్తారు. వివిధ ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్న నేటి ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండటం వల్ల మీ జీవన నాణ్యత మెరుగుపడటమే కాకుండా మీ పని మెరుగ్గా చేస్తారు. వ్యాయామం చేయడానికి బద్దకంగా భావిస్తే మీరు రన్నింగ్, సైక్లింగ్, ఆరోగ్యకరమైన ఆహారం వంటి ఉత్తమ అలవాట్లను పాటిస్తే సరిపోతుంది.

1. నడక, రన్నింగ్‌

వాకింగ్‌ అనేది మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలిగే వ్యాయామం. రోజూ పరుగెత్తడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీ బరువుని కంట్రోల్లో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రన్నింగ్ ప్రయోజనాలను పొందాలంటే మీరు గంట పాటు పరుగెత్తాల్సిన అవసరం లేదు. కేవలం 15 నిమిషాల పరుగు లేదా జాగింగ్ చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రన్నింగ్ అనేది మీరు మీ దినచర్యలో కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఒక వ్యాయామం.

2. సైక్లింగ్

సైక్లింగ్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే మరొక వ్యాయామం. మీరు ఈ యాక్టివిటీని ఆస్వాదించడం ద్వారా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు సైకిల్‌పై వెళ్లండి. సైక్లింగ్ మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని ఉత్తేజపరుస్తుంది. మీరు ఒత్తిడికి గురైనట్లయితే కొంత సమయం పాటు సైక్లింగ్‌కు వెళ్లవచ్చు. ఈ యాక్టివిటీ మీకు రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

3. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం

చక్కెర అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ చక్కెర మీ చర్మం, జుట్టుకు హాని కలిగిస్తుంది. కాబట్టి చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం మానుకోండి. బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా వీటికి దూరంగా ఉంటే మంచిది.

4. దూమపానం వదిలేయండి

ధూమపానం మంచి అలవాటు కాదు ఇది మీ ఆరోగ్యాన్ని చెడిపోయేలా చేస్తుంది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది పొగతాగుతున్నారు. కానీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ అలవాటును వదిలించుకోవడం చాలా అవసరం.

5. ఆరోగ్యకరమైన ఆహారం

ఆహారంలో రంగురంగుల కూరగాయలను చేర్చండి. ఇది కాకుండా సీజనల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారాలను తినండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి. అంతేకాదు మంచి ఆహారం తీసుకుంటే వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుంది.

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

శరీరంలో ఈ నాలుగు పోషకాలు లేకపోతే అంతే సంగతులు.. ఈ రోగాలు వెంటనే అటాక్..?

Super Foods: చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావొద్దంటే ఈ ఫుడ్స్‌ తప్పనిసరి.. సింపుల్‌ డైట్‌

Shocking Video: బ్రిడ్జి విరిగిపడి నదిలో పడటం చూశారా.. వందల మంది కొట్టుకుపోయారు..?