శరీరంలో ఈ నాలుగు పోషకాలు లేకపోతే అంతే సంగతులు.. ఈ రోగాలు వెంటనే అటాక్..?
Health News: కరోనా వల్ల ప్రజలు ఫిట్‌నెస్‌పై బాగా దృష్టిపెట్టారు. వాస్తవానికి శరీరం దృఢంగా ఉంటే వృద్ధాప్యం కూడా చాలా ఆలస్యంగా వస్తుంది.
Health News: కరోనా వల్ల ప్రజలు ఫిట్‌నెస్‌పై బాగా దృష్టిపెట్టారు. వాస్తవానికి శరీరం దృఢంగా ఉంటే వృద్ధాప్యం కూడా చాలా ఆలస్యంగా వస్తుంది. ఇందుకోసం మంచి పోషకాహారంపై దృష్టి సారించాలి. లేదంటే కండరాల బలహీనత, ఎముకల బలహీనత మొదలైన సమస్యలు ఏర్పడుతాయి. అంతే కాదు చర్మం పాలిపోయి వృద్ధాప్యం వస్తుంది. జుట్టు నెరసిపోవడం వేగవంతమవుతుంది. ఈ పరిస్థితిలో మన శరీరానికి ఏ మూలకాలు ఎక్కువ అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. విటమిన్ B12
విటమిన్ B12 రక్తం, నరాల కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇది మాంసం, చేపలు, గుడ్లు, పాల ద్వారా లభిస్తుంది. మీరు నాన్ వెజ్ తినకపోతే డాక్టర్ సలహాతో ఆహారంలో కొన్ని మందులు, సప్లిమెంట్లను చేర్చుకోవచ్చు. ఇది కాకుండా విటమిన్ B6 జెర్మ్స్‌తో పోరాడటానికి శక్తిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది.
2. కాల్షియం, మెగ్నీషియం
కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా చేస్తుంది. వృద్ధాప్యంలో శరీరానికి కాల్షియం చాలా అవసరం. పాల ఉత్పత్తులలో కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మనం ఆహారంలో పాలు, పెరుగు మొదలైనవాటిని చేర్చుకోవాలి. దీంతో పాటు శరీరానికి మెగ్నీషియం అవసరం కూడా చాలా ఉంటుంది. దీని కారణంగా మీ రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది దీని కోసం మీరు గింజలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3. ఒమేగా 3S, విటమిన్ డి
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో శరీరానికి తెలియదు. ఇది మెదడు, నాడీ కణాలు, స్పెర్మ్ కణాల తయారీకి అవసరమవుతుంది. అల్జీమర్స్, చిత్తవైకల్యం, అంధత్వాన్ని నివారించడానికి శరీరంలో ఒమేగా 3 కలిగి ఉండటం అవసరం. దీని కోసం మీరు రోజువారీ దినచర్యలో కొవ్వు చేపలు, వాల్నట్లను చేర్చాలి. అంతే కాకుండా సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి వృద్ధాప్యంలో తప్పనిసరిగా పొందాలి. సార్డినెస్, మాకేరెల్ చేపలలో విటమిన్ డి దొరుకుతుంది.
4. జింక్, పొటాషియం
జింక్ వాసన, రుచిని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. పొటాషియం గుండె, కండరాలు, మూత్రపిండాలు, నరాలకు అవసరం. ఇది బచ్చలికూర, పాలు, అరటిపండ్లలో ఎక్కువగా ఉంటుంది.